ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 14:11
Hopes should be recognized as government employees

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి):  ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ములుగు జిల్లా 2వ మహాసభ నీలదేవి, ప్రభావతి అధ్యక్షతన శనివారం జరిగింది. మహాసభలు ప్రారంభ సూచకంగా సిఐటియు జెండాను ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నీలదేవి ఆవిష్కరించారు.అనంతరం బతుకమ్మ ఆట ఆడటం జరిగింది.ఈ మహాసభకు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి హాజరై మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు గ్రామ స్థాయిలో అనేక వైద్యపరమైన పనులే కాకుండ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకం ప్రవేశ పెట్టిన మొదటి పని ఆశా కార్యకర్తల మీద పడుతుందని అన్నారు. వీరికి పనికి తగిన పారితోషికంలేదని,కనీస వేతనం అమలు కావడం లేదని అన్నారు. జిల్లాలో ఈ హెల్త్ ప్రొఫైల్ టిఏ,డిఏ ఇప్పటి వరకు ఇవ్వడం లేదని,ఈ పండగలోపు ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

నిత్యం ప్రజా ఆరోగ్యం అవగాహన కల్పించే వారికి ప్రమాద భీమా సౌకర్యం, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా లేవని అన్నారు.కరోనా లాంటి మహమ్మారి రోగాలను సైతం లెక్క చేయకుండ సేవలందించే విరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పాలకులు గుర్తించటం లేదని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీరిని గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డుతో గుర్తింపు ఇస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపును నోచుకోవడం లేదన్నారు. రాబోయే రోజుల్లో ఆశా కార్మికులుగా గుర్తించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మిక హక్కులను రద్దు చేసి ప్రభుత్వమే కార్మికులను మోసం చేసిందని అన్నారు. నిత్యంప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తప్పుతోవ పట్టించడానికి మతం పేరుతో ప్రజల్లో వైశమ్యాలు సృష్టిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆశాలు ఐక్యంగా ఉండి సాధించుకోవాలని సూచించారు.నిత్యం వచ్చే అధికార రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్,గుండెబోయిన రవిగౌడ్,మడే రవి,ప్రభావతి,నాగమణి, శ్రావ్య,కవిత,రాధ, సుజాత,మాధవి, సంధ్య,శోభ,మధురాణి, సత్యవతి,రమణ,సరిత,ఉష,కోమల,రజిత 350 మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.