అచ్చంపేట

బీసీ రాజ్యాధికార రాష్ట్ర నాయకునికి ఘన సన్మానం.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 13:10

అచ్చంపేట సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి.  బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు చేనేత కార్మికులకు భీమా కోసం కృషి చేసిన వ్యక్తి దాసు సురేష్ సోమవారం అచ్చంపేటకు వచ్చేసిన సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా సురేష్ నాయకత్వంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కార పరిష్కారం కోసం కృషి చేశారని సందర్భంగా పేర్కొన్నారు ఏర్పాటు చేయబోయే సమావేశానికి బీసీ మేధావులు కవులు ఉద్యోగులు ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు అదేవిధంగా సెప్టెంబర్ 21వ తేదీన జల దృశ్యంలో ఆచార్యకొండ లక

బాణాలలోమహిళా.ఆత్మహత్య.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 13:09

అచ్చంపేట సెప్టెంబర్ 19 ప్రజాజ్యోతి. ఓ మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బల్మూరు మండలంలోని బాణాల గ్రామంలో జరిగింది. సంఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కోర్ర పార్వతి( 40.) సంవత్సరాలు అని మహిళా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన పార్వతి వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నాగర్ కర్నూల్ హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గిరిజన సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

Submitted by sridhar on Mon, 19/09/2022 - 14:37

అచ్చంపేట సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ గిరిజన బంధు అమలు చేస్తానని ప్రకటన చేసిన సందర్భంగా ఆదివారం అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గిరిజన నేతలు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల పట్ల సానుకూలంగా స్పందించి ఆరు నుంచి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా గొప్ప విషయమని వారు పేర్కొన్నారు అదేవిధంగా గిరిజన బంధు కూడా అమలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడం గిరిజనులకు చాలా వరమని ఈ సందర్భంగ

56వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె.

Submitted by Ashok Kumar on Mon, 19/09/2022 - 14:24

అచ్చంపేట సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి.  దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారానికి 56వ రోజుకు చేరింది అచ్చంపేట నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో వీఆర్ఏలు తహసిల్దార్ కార్యాలయాల్లో విధులను బహిష్కరించి సమ్మె కార్యక్రమం చేపడుతున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం తమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా వీఆర్ఏల ప్రమోషన్లు గౌరవేతనాలు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చలనం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్యన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీఆర్ఏల సంఘం నాయకులతో చర్చలు జరిపినప్ప

వజ్రోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే బాలరాజు.

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 14:15

అచ్చంపేట సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి. వజ్రోత్సవ.కార్యక్రమంలో భాగంగా ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లను  అచ్చంపేట పట్టణంలో  స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను గురువారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిశీలించారు.

అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి.

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 17:22
  • దరఖాస్తులు పరిశీలించకుండానే కొంతమందికే పెన్షన్లు మంజూరు.
  • అర్హులందరికీ  పెన్షన్ ఇవ్వాలని త్వరలో ధర్నా చేపడతాం
  • డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ.

అచ్చంపేట సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొంతమందికే మంజూరు చేసి మిగతా వారికి ప్రభుత్వం మొండి చేయి చూపిందని డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.

ఉపాధ్యాయులను అరెస్టు చేయడం కాదు.

Submitted by sridhar on Tue, 13/09/2022 - 20:02
  • సమస్యలు పరిష్కరించండి.
  • డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి.

అచ్చంపేట సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి. సమస్యలను పరిష్కరించాలని చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతుండగా ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే అరెస్టు చేయడం అప్రజా స్వామికమని డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి అన్నారు మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న సమయంలో ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీసులు అచ్చంపేట పోలీస్ స్టేషన్ తరలించారు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సమంజసం కాదన్నారు అరెస్టు చేయడం కాదు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీసీ బాలికల హాస్టల్ తనిఖీ చేసిన అధికారులు.

Submitted by sridhar on Tue, 13/09/2022 - 09:49
  • జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

అచ్చంపేట సెప్టెంబర్ 12 ప్రజా జ్యోతి ; బల్మూర్ బీసీ బాలికల వసతి గృహాన్ని కస్తూర్బా గాంధీ పాఠశాలను సోమవారం అధికారులు తనిఖీ చేశారు సందర్భంగా తహసిల్దార్  క్రిస్టియ నాయక్ ఎంపీడీవో దేవన్న సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా బీసీ బాలికల వసతి గృహంలో చాలా రోజుల నుంచి విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్న మ్యాట్రిన్ పట్టించుకోవడంలేదని వచ్చిన ఫిర్యాదు మేరకు బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి వివిధ సమస్యల గురించి విద్యార్థులతో మాట్లాడటం జరిగిందని తాసిల్దార్ తెలిపారు.