వజ్రోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే బాలరాజు.

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 14:15
District Collector MLA Balaraju inspected the Vajrotsava arrangements.

అచ్చంపేట సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి. వజ్రోత్సవ.కార్యక్రమంలో భాగంగా ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లను  అచ్చంపేట పట్టణంలో  స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను గురువారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల ఏర్పాట్ల గురించి అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది స్టేడియంలో తాగునీరు వసతి ఇతర కార్యక్రమాల పైన మాట్లాడారు శుక్రవారం ఉదయం అచ్చంపేట పట్టణంలో నిర్వహించే  ర్యాలీ కార్యక్రమం పై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎమ్మెల్యే అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ ఆర్డిఓ పాండు నాయక్ డీఎస్పీ కృష్ణ కిషోర్ ఆర్డబ్ల్యూఎస్ డి ఈ హేమలత తహసీదారులు కృష్ణయ్య క్రిస్టియనాయక్ ఇన్చార్జి ఎంపిడిఓ మధుసూదన్ గౌడ్ అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు