బాణాలలోమహిళా.ఆత్మహత్య.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 13:09
Woman in Arrows.Suicide.

అచ్చంపేట సెప్టెంబర్ 19 ప్రజాజ్యోతి. ఓ మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బల్మూరు మండలంలోని బాణాల గ్రామంలో జరిగింది. సంఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కోర్ర పార్వతి( 40.) సంవత్సరాలు అని మహిళా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన పార్వతి వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నాగర్ కర్నూల్ హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త ముగ్గురు.పిల్లలు ఉన్నారు.ఫోటో రైట్ అప్మృతి చెందిన పార్వతి.