Telkapalle

57వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్ష లు

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 13:07

తెలకపల్లి, సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి ): మండల కేంద్రంలో వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మె సోమవారం 57వ రోజుకు చేరింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు గతంలో స్థానికంగా పనిచేసిన కొందరు వీఆర్వోలు దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు కార్యక్రమంలో జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి కే అంజనేయులు మండల జేఏసీ చైర్మన్ అశోక్ కో చైర్మన్ ఇబ్రహీం ప్రధాన కార్యదర్శి రాము సాయి బాలమ్మ సుల్తాన్ సైదులు భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి పట్టని అధికారులు

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 14:45

తెలకపల్లి,సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి):  తెలకపల్లి మండలంలో ప్రజావాణి కార్యక్రమం అధికారులు పట్టించుకోకుండా పోతున్నారు సోమవారం మండల కాంప్లెక్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి మండల సమైక్య కార్యాలయం సిసి నిరంజన్ మాత్రమే వచ్చి కూర్చున్నారు ఇతర శాఖల అధికారులు ఎంతకు రాకపోవడంతో తమ సమస్యలు విన్నవించడానికి వచ్చిన ప్రజలు ఆరు బయట కూర్చుని అధికారుల రాక కోసం నిరీక్షించారు.

వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతాం వీఆర్ఏల జేఏసీ జిల్లా చైర్మన్ విజయ్

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 14:35

తెలకపల్లి, సెప్టెంబర్ 18( ప్రజాజ్యోతి):  వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వీఆర్ఏల జేఏసీ జిల్లా చైర్మన్ ఆర్ విజయ్ మండల జేఏసీ చైర్మన్ అశోక్ అన్నారు మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం ఎదుట శిబిరం వద్ద ఆదివారం సమ్మె 56వ రోజు సందర్భంగా దీక్షలో పాల్గొని మాట్లాడుతూ వెంటనే వీఆర్ఏలకు పే స్కేల్ ప్రమోషన్స్ వారసులకు ఉద్యోగాలు ఇస్తూ జీవో విడుదల చేసే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు దీక్షలో వీఆర్ఏల జేఏసీ మండల ప్రధాన కార్యదర్శి రాము వీఆర్ఏలు సాయి సుల్తాన్ బాలమ్మ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సిండికేట్ మద్యం అమ్మకాలు పట్టించుకోని అధికారులు

Submitted by Ashok Kumar on Mon, 19/09/2022 - 14:31

తెలకపల్లి, సెప్టెంబర్ 18 (ప్రజాజ్యోతి): . మండల కేంద్రంలో సిండికేట్ మద్యం అమ్మకాలతో ప్రజలు నష్టపోతున్నామని అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్యం దుకాణాలను అనుసరించి బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం వ్యాపారులు అధిక ధరలతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు అదేవిధంగా వివిధ చోట్ల అడ్డగోలుగా బెల్టు షాపులు నిర్వహిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు ఈ క్రమంలో రోడ్డు వెంట తరచు గొడవలు జరుగుతూ వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని సమస్యను అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు విమర్శిస్తున్నారు.

విశ్వకర్మ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 17:06

తెలకపల్లి, సెప్టెంబర్ 17( ప్రజాజ్యోతి):  మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వారితో మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు అదేవిధంగా విశ్వకర్మలు కమ్యూనిటీ హాల్ భవనం మంజూరు చేయాలని కోరడంతో త్వరలో నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కార్యక్రమంలో డి సి సి బి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి బైకానీ శ్రీనివాస్ యాదవ్ విశ్వకర్మల సంఘం ప్రతినిధులు ఉమాపతి చార్యులు రామాచార్యులు ఎంపీపీ కొమ్ము మధు మాజీ జెడ్పిటిసి ఈదుల నరేందర్ రెడ్

ఘనంగా సమైక్యత దినోత్సవం

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 16:58

తెలకపల్లి, సెప్టెంబర్ 17 (ప్రజాజ్యోతి):  మండలంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కొమ్ము మధు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ తబితారాణి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కార్యక్రమంలో  ఎంపీటీసీలు ఆర్ రమేష్ లక్ష్మమ్మ విజయలక్ష్మి ఉప సర్పంచ్ కృష్ణ రైతుబంధు అధ్యక్షులు మాధవరెడ్డి ఉప తహసిల్దార్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 16:56

తెలకపల్లి, సెప్టెంబర్ 17 (ప్రజాజ్యోతి):  రెండు నెలలుగా సమ్మెను కొనసాగిస్తున్న వీఆర్ఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి ఆదుకోవాలని వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు కే అంజనేయులు సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు శనివారం తెలకపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట శిబిరం వద్ద సిఐటియు శ్రీనివాసులు వీఆర్ఏలకు మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆర్ శ్రీనివాసులు అన్నారు కార్యక్రమంలో వీఆర్ఏలు ఆర్ విజయ్ అశోక్ రాము ఇబ్రహీం సాయి బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

సమ్మె ప్రభావం జెండా తోరణాలు కడుతున్న ఉపతహసిల్దార్

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 16:09

 తెలకపల్లి, సెప్టెంబర్ 16( ప్రజాజ్యోతి):.  మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏల సమ్మె కారణంగా శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించడం కోసం ఉపతహసిల్దార్ లక్ష్మణ్ నాయక్ స్వయంగా జెండా తోరణాల అలంకరణ నిర్వహించారు రెండు నెలలుగా వీఆర్ఏలు సమ్మెకు దిగి విధులను విస్మరించడంతో సిబ్బంది చేయాల్సినటువంటి వివిధ పనులు అధికారులే చేస్తుండడం గమనార్హం.

విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలు వేసిన సర్పంచి స్రవంతి

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 17:15

తెలకపల్లి,సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి): మండలంలోని రాకొండ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచి స్రవంతి ఆల్బెండజోల్ మాత్రలను వేశారు గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు మాత్రలు వేశారు కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ గౌడ్ పల్లె దావకాన వైద్యాధికారి డాక్టర్ శ్రీజ ఎంపీటీసీ శివారెడ్డి ప్రిన్సిపాల్ హసీనా సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా హిందీ భాషా దినోత్సవం

Submitted by Ashok Kumar on Wed, 14/09/2022 - 16:27

తెలకపల్లి, సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి): మండల కేంద్రం సిద్ధార్థ మోడల్ స్కూల్ వద్ద బుధవారం హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హిందీ జాతీయ భాష ను ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని అవగాహన చేశారు ఈ సందర్భంగా హిందీ పండిత్ సాధిక బేగం ను విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగ్యశ్రీ సతీష్ కుమార్ గౌడ్ మల్లేష్ ఆంజనేయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.