Telkapalle

చదువులో విద్యార్థులను ప్రోత్సహించాలి గుగ్గిళ్ళ ప్రకాష్

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 12:59

తెలకపల్లి, సెప్టెంబర్ 24(ప్రజాజ్యోతి): విద్యార్థులను చదువులో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గుగ్గిళ్ళ ప్రకాష్ అన్నారు తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం బాలస్వామి అధ్యక్షతన శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేందుకు కృషి చేయాలని విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని విద్యా కమిటీ చైర్మన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిపిఎస్ విద్యా కమిటీ చైర్మన్ మల్లేష్ పాల్గొన్నారు.

విద్యార్థుల బతుకమ్మ సంబరాలు

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 12:57

తెలకపల్లి,సెప్టెంబర్ 24 (ప్రజాజ్యోతి):  మండల కేంద్రంలో సిద్ధార్థ మోడల్ స్కూల్ విద్యార్థులు శనివారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగ విశేషాలను విద్యార్థులకు అవగాహన చేశారు.

ఆధార్ కేంద్రం ఏర్పాటుకు వినతి

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 13:55

తెలకపల్లి,సెప్టెంబర్ 23(ప్రజాజ్యోతి):  మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువకుడు శ్రీహరి శుక్రవారం తహసిల్దార్ తబితా రాణి కి వినతి పత్రం అందజేశారు చాలాకాలంగా మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ఆధార్ కేంద్రం నిర్వహణకు ఆధార్ ధ్రువపత్రం కలిగి ఉన్న తనకు అవకాశం కల్పించాలని శ్రీహరి కోరారు ఈ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తాసిల్దార్ తెలిపారు.

మద్యం వ్యాపారుల దోపిడిని అరికట్టాలి

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 13:53

తెలకపల్లి,సెప్టెంబర్ 23(ప్రజాజ్యోతి) :తెలకపల్లి మండల కేంద్రంలో మద్యం సిండికేట్ వ్యాపారుల దోపిడిని వెంటనే అరికట్టాలని ఎంపిటిసి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు శుక్రవారం ఎంపీటీసీ రమేష్ తదితరులు ఎక్సైజ్ ఎస్సై బాలవర్ధన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం సిండికేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా అధిక ధరలతో దోపిడీకి పాల్పడుతూ దగా చేస్తున్నారని వివరించారు అదేవిధంగా రోడ్డు వెంట ఉన్న మద్యం దుకాణాల వద్ద గొడవలు జరుగుతున్నాయని వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారిందని నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సిండికేట్ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.

ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు పంచాయతీ కార్యదర్శి భాస్కర్

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 13:49

తెలకపల్లి,సెప్టెంబర్ 23(ప్రజాజ్యోతి):   ప్రజలు ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 500 రూపాయలు జరిమానా తగిన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి భాస్కర్ తెలిపారు అదేవిధంగా మండల కేంద్రంలో శుక్రవారం స్వచ్ఛతా హి సేవ పేరుతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ఎం బాలస్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి రెండు లక్షలు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే మర్రి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 16:57

తెలకపల్లి, సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి):  మండల కేంద్రానికి చెందిన అనారోగ్య బాధితుడు సంగెంగౌడ్ మెరుగైన వైద్యం కోసం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం గురువారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు కొద్ది కాలంగా జాండీస్ హెర్నియాతో బాధపడుతున్న సంగెంగౌడ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు మంజూరు చేయించారు ఈ సహాయాన్ని ఎల్ ఓ సి ద్వారా ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదుల నరేందర్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు చెన్న నరసింహ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ నాయకులు సొంటె శీను బారిగారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు పోరాడుతున్న ఎస్ టి యు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 16:41

తెలకపల్లి, సెప్టెంబర్ 22( ప్రజాజ్యోతి):  ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ఎస్ టి యు నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ అన్నారు మండలంలోని గౌరెడ్డిపల్లి గ్రామ ఉన్నత పాఠశాల వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు సిపిఎస్ రద్దు సాధించడంలో ఎస్ టి యు ముఖ్యపాత్ర పోషించిందని చెప్పారు ఎస్ టి యు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 26న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వెలమ ఫంక్షన్ హాల్ వద్ద వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాసభకు రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ ప్రధాన కార్యదర్శి పర్వత్ రెడ్డి రానున్నట్లు తెలిపార

కెసిఆర్ పెద్ద కొడుకు అయితే నేను చిన్న కొడుకును ఎమ్మెల్యే మర్రి

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 16:43

తెలకపల్లి,సెప్టెంబర్ 21( ప్రజాజ్యోతి):  రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పెద్దకొడుకు అయితే నేను నా నియోజకవర్గ ప్రజలకు చిన్న కొడుకునని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలో బుధవారం కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా నాగర్ కర్నూల్ లో ఆసుపత్రి వైద్య కళాశాల మంజూరు చేయించగా కొందరు అడ్డుపడుతున్నారని నాగర్ కర్నూల్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని తన జీవితం ప్రజలకే అంకితం అని ఎమ్మెల్యే మర్రి జన

మునుగోడు తరలి వెళ్లిన బి.ఎస్.పి నాయకులు

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 13:55

తెలకపల్లి,సెప్టెంబర్ 20 (ప్రజాజ్యోతి): తెలకపల్లి మండలం నుండి మంగళవారం బహుజన సమాజ్ పార్టీ నాయకులు నల్గొండ జిల్లా మునుగోడు కు తరలి వెళ్లారు ప్రధాన చౌరస్తాలో సమావేశమై బి.ఎస్.పి కన్వీనర్ శివశంకర్ మాట్లాడుతూ పార్టీ అధినేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార దిశగా రెండవ విడత యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో నాయకులు మద్దెల బండ సాయిబాబు రాజేష్ సురేష్ వంశీ శ్రీను భాస్కర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

నూతన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి డాక్టర్ శ్యామ్

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 17:12

 తెలకపల్లి, సెప్టెంబర్ 20( ప్రజాజ్యోతి):  దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరుతో నామకరణం చేయాలని మండలానికి చెందిన సహాయ ఆచార్య డాక్టర్ శ్యాంసుందర్ డిమాండ్ చేశారు మంగళవారం ఆయన మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పార్లమెంటు భవనానికి  పెట్టడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు.