మహదేవ్ పూర

సంపూర్ణ ఆరోగ్యానికి బూస్టర్ డోస్ టీకా తప్పనిసరి.... జడ్పీ సీఈఓ శోభారాణి..

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 16:38

మహాదేవపూర్ సెప్టెంబర్ 20 ప్రజాజ్యోతి;;;/ మహాదేవపూర్ మండల కేంద్రంలో జయశంకర్ భూపాలపల్లి  జడ్పీ సీఈఓ శోభారాణి  పర్యటించారు.మన ఊరు మన బడి పనుల పురోగతిని పరిశీలించిన తర్వాత వాడల్లో కొనసాగుతున్న మొబైల్ బూస్టర్ డోస్ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు.రెండు డోస్ ల టీకా పూర్తయిన వారు బూస్టర్ డోస్ టీకా తప్పనిసరిగా వేసుకోవాలని,టీకా లపై అపోహలు వద్దని,శరీరానికి రోగ నిరోధక శక్తి నిచ్చేందుకు టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని,టీకాల పట్ల నిర్లక్ష్యం చేస్తే.మన ఆరోగ్యానికి హాని చేసినట్లు అన్నారు.ప్రభుత్వం నుండి ఉచితంగా అందించే టీకాలను హక్కుగా పొందడం పౌరుడిగా మన బాధ్యత అని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నా

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం....

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 12:33


మహాదేవపూర్ సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి. మహాదేవపూర్ ప్రభుత్వ పాటశాల కాంప్లెక్స్ లో గురువారం కాళేశ్వరం పీ హెచ్ సీ డాక్టర్ జగదీష్,అధ్యర్యంలో  ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో  విద్యార్థినిలకు ఎంపీపీ బి. రాణీ బాయి ,జడ్పీటీసీ గుడాల అరుణ,డీ వార్మింగ్ మాత్రల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జగదీష్, ఆర్ బి ఎస్ కే టీమ్, ఏ ఎన్ ఎం లు, ఆశావర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు..

పోషకవిలువలతో కూడిన ఇంటి వంటల ప్రాముఖ్యత తెలిసేలా ఫుడ్ ఫెస్టివల్ సీడీపీఓ రాధిక.

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 17:05

మహాదేవపూర్ సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి  .మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పోషణ్ అభిమాన్ పోషక ఆహార మాసోత్సవాల సందర్భంగా సీడీపీఓ రాధిక ఆధ్వర్యంలో అంగన్వాడీలు సంప్రదాయ పోషక విలువలతో కూడిన ఇంటి వంట ల ప్రాముఖ్యత తెలిసేలా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.గ్రామీణ మహిళలు రోజు తీసుకొనే ఆహారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని,అన్ని పోషకాలు అందేలా సమతౌల్య ఆహారం తీసుకోవాలని,పూర్వ కాలంలో అమ్మమ్మ చేతి వంట లో అన్ని రకాల పోషకాలు ఉండేవని సీడీపీఓ రాధిక అన్నారు.పోషకాహార వంటలు ప్రదర్శన గా ఉంచి,ఆహారంలో వాటి ప్రాముఖ్యత ను తెలియజేశారు..మహిళలు ఇంటి పనుల్లో పెట్టిన శ్రద్ధ ఆహారంలో పెట్

పోషకహార అవగాహనపై అంగన్వాడీల ర్యాలీ.

Submitted by veerareddy on Thu, 08/09/2022 - 18:01

మహాదేవపూర్ సెప్టెంబర్ 8 ప్రజా జ్యోతి ,  మహాదేవపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీలు పోషణ్ అభియాన్ మాసోత్సవాలు సందర్భంగా కిషోర బాలికలతో ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించారు.అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పోషణ అభియాన్ మాసోత్సవాల ఆవశ్యకత-కిషోర బాలికల ఆరోగ్యం-ఆహారం పై గ్రామ సభ నిర్వహించారు.

పచ్చదనం తో రహదారులు కళ కళలాడాలి కలెక్టర్ భవేశ్ మిశ్రా

Submitted by sridhar on Tue, 06/09/2022 - 16:07

భూపాలపల్లి ప్రతినిధి , సెప్టెంబర్6 ప్రజాజ్యోతి: హరితహారం కార్యక్రమం లో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి 353 సి కి ఇరువైపుల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో హరితహారం. కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కలను ( మాస్ ఎవెన్యూ ప్లాంటేషన్) మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులు, స్టానిక ప్రజా ప్రతి నిధులతో కలిసి పరిశీలించారు.పచ్చదనం తో జాతీయ రహదారులు కళ కళలాడాలన్నదే మన ముఖ్యమంత్రి కే సీ ఆర్ ఆకాంక్ష అని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఆసరా పింఛన్ పత్రాల అందజేత

Submitted by sridhar on Tue, 06/09/2022 - 09:19

మహాదేవపూర్ సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి ; మహాదేవపూర్ మండలంలోని చండుపల్లి, అన్నారం, మద్దులపల్లి, పలుగుల,  సూరారం, పెద్ద౦పేట్, రాపెళ్ళికోట, ఎన్కపల్లి  గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం చే నూతనంగా జారీ చేసిన ఆసరా పింఛన్లకు సంబంధించి పింఛన్ పత్రాలను పాతవాటిని మరియు కొత్తవాటిని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాణి బాయి ,  మరియు ఎంపీడీవో శ్రీ శంకర్,  లబ్దిదారులకు అందజేసినారు . వారు మాట్లాడుతూ మహదేవపూర్ మ౦డలములో వృద్దాప్య 717, విత౦తు 80, వికలా౦గుల 21, సి౦గిల్ ఉమన్ 2  మొత్తముగా 820 పి౦చన్లు మ౦జూరి అయినవి అని ఇ౦కనూ అర్హతకలవారు ఎవరైనా ఉ౦టే దరఖాస్తు చేసుకోవాలని కోరినారు.

6న మహాదేవపూర్ లో దివ్యాంగుల శిబిరం

Submitted by sridhar on Mon, 05/09/2022 - 12:50

మహాదేవపూర్ సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి; మహాదేవపూర్ లో మంగళ వారం దివ్యాంగుల శిబిరం నిర్వహిస్తామని, అర్హులైన దివ్యాంగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీపీ బి. రాణీ బాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మహాదేవపూర్ మండల పరిషత్  కాంప్లెక్స్ లో నిర్వహించే దివ్యాంగుల శిబిరంలో మహాదేవపూర్, కాటారం, పలిమెల, మలహర్, మహాముతారం మండలాలకు చెందిన వారు పాల్గొని కృత్రిమ అవయవాలు పొందాలని ఎంపీపీ పేర్కొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ

Submitted by sridhar on Mon, 05/09/2022 - 12:47

మహాదేవపూర్ సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి ;మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రెవెల్లి రాములు కుటుంభాన్ని జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ ఫర్సన్  శ్రీ జక్కు శ్రీహర్షిణి-రాకేష్ పరామర్శించారు. యూత్ టౌన్ ప్రసిడెంట్ గా టీ ఆర్ ఎస్ పార్టీ కి సేవలు అందిస్తున్న రెవెల్లి రాజశేఖర్ ,తండ్రి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళి అర్పించారు.