పచ్చదనం తో రహదారులు కళ కళలాడాలి కలెక్టర్ భవేశ్ మిశ్రా

Submitted by sridhar on Tue, 06/09/2022 - 16:07
Roads should be decorated with greenery Collector Bhavesh Mishra

భూపాలపల్లి ప్రతినిధి , సెప్టెంబర్6 ప్రజాజ్యోతి: హరితహారం కార్యక్రమం లో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి 353 సి కి ఇరువైపుల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో హరితహారం. కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కలను ( మాస్ ఎవెన్యూ ప్లాంటేషన్) మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులు, స్టానిక ప్రజా ప్రతి నిధులతో కలిసి పరిశీలించారు.పచ్చదనం తో జాతీయ రహదారులు కళ కళలాడాలన్నదే మన ముఖ్యమంత్రి కే సీ ఆర్ ఆకాంక్ష అని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం హరితహారం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపి ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, ప్రతి మొక్కకు దాదాపు రూ.250 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని వీటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని, గ్రామ పంచాయితీ బడ్జెట్ లో 10% గ్రీన్ బడ్జెట్ కింద నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాకు వచ్చే పర్యాటకులకు స్వర్గ ధామం లాంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ,ఘన్ పూర్, భూపాలపల్లి, కాటారం ,మహాదేవపూర్, కాళేశ్వరంలో జాతీయ రహదారి పొడవునా మొక్కలు పెంచడానికి అదనంగా మరో కోటి రూపాయలు నిధులు ఉన్నట్లు తెలిపారు.రోడ్డు పై పాదయాత్ర చేస్తూ మొక్కలను క్షుణంగా పరిశీలించారు.అందంగా ఉండే పూలు పూచే మొక్కలను విరివిగా నాటాలని అన్నారు. మొక్కల సంరక్షణ కు గ్రామ పంచాయతీ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటన లో ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ శ్రీపతిబాపు, ఎం.పీ.పీ బి రాణి బాయి,జడ్పీటీసీ గుడాల అరుణ, నాయక్,ఎంపిఓ ప్రసాద్,ఉపాధి హామీ ఏపీఓ రమేష్,ఇంజనీర్ కాటారపు శ్రీనివాస్,ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవళిక తదితరులు ఉన్నారు.