పోషకహార అవగాహనపై అంగన్వాడీల ర్యాలీ.

Submitted by veerareddy on Thu, 08/09/2022 - 18:01
Anganwadis rally on nutrition awareness.

మహాదేవపూర్ సెప్టెంబర్ 8 ప్రజా జ్యోతి ,  మహాదేవపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీలు పోషణ్ అభియాన్ మాసోత్సవాలు సందర్భంగా కిషోర బాలికలతో ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించారు.అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పోషణ అభియాన్ మాసోత్సవాల ఆవశ్యకత-కిషోర బాలికల ఆరోగ్యం-ఆహారం పై గ్రామ సభ నిర్వహించారు. .ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నెల రోజులపాటు పోషణ్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ మాసోత్సవాల్లో మహిళల్లో పోషకాహారం లోపం,బాలికల విద్య కు ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని,తినే ఆహారంలో పోషకవిలువలు లోపిస్తే,పిల్లల శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండదని,సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడాల అరుణ ,  గ్రామ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.