పోషకవిలువలతో కూడిన ఇంటి వంటల ప్రాముఖ్యత తెలిసేలా ఫుడ్ ఫెస్టివల్ సీడీపీఓ రాధిక.

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 17:05
Food festival to know the importance of nutritious home cooking..CDPO Radhika.

మహాదేవపూర్ సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి  .మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పోషణ్ అభిమాన్ పోషక ఆహార మాసోత్సవాల సందర్భంగా సీడీపీఓ రాధిక ఆధ్వర్యంలో అంగన్వాడీలు సంప్రదాయ పోషక విలువలతో కూడిన ఇంటి వంట ల ప్రాముఖ్యత తెలిసేలా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.గ్రామీణ మహిళలు రోజు తీసుకొనే ఆహారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని,అన్ని పోషకాలు అందేలా సమతౌల్య ఆహారం తీసుకోవాలని,పూర్వ కాలంలో అమ్మమ్మ చేతి వంట లో అన్ని రకాల పోషకాలు ఉండేవని సీడీపీఓ రాధిక అన్నారు.పోషకాహార వంటలు ప్రదర్శన గా ఉంచి,ఆహారంలో వాటి ప్రాముఖ్యత ను తెలియజేశారు..మహిళలు ఇంటి పనుల్లో పెట్టిన శ్రద్ధ ఆహారంలో పెట్టడం లేదని,మహిళలు సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే తరుచుగా అనారోగ్యానికి గురవుతున్నారని,రక్తహీనత,నిద్రలేమి లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని,గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు,కిషోర బాలికలు ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతిబాపు, ఎంపీపీ రాణి బాయి, జడ్పీటీసీ గుడాల అరుణ,గ్రామ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు,తల్లులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.