Addagudur

బాధిత కుటుంబాన్ని పరామర్శ

Submitted by sudhakar on Fri, 16/09/2022 - 10:16

అడ్డగూడూర్ సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి ).అడ్డగూడూరు మండలం లక్ష్మి దేవి కాల్వ గ్రామంలో గల సర్పంచ్ పనుమటి అంజయ్య  గారి మాతృమూర్తి  పనుమటి నాంచారమ్మ అనారోగ్యం తో మరణించడం జరిగింది. వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ సాయి హాస్పిటల్ ఎండి ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మరియు  బాలెంల సైదులు ఈ కార్యక్రమంలో రవి బండి మధు బండి నాగరాజు  అబ్బులు ,బాలెంల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు

అడ్డగూడూరు మండలంలో వార సంత అంగడి ఏర్పాట్లు

Submitted by sudhakar on Thu, 15/09/2022 - 15:50

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి .అడ్డగూడూర్ మండలంలో గల రేపటి వారం సంతను (అంగడి)ని విజయవంతం చేయండి.సంతలో ముందు వరుసలో పండ్ల, కూరగాయల దుకాణాలు.వెనుక వరుసలో పశువుల,మేకల, గొర్రెల,కోళ్ళ కోనుగోలు కేంద్రం తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం రేపు అనగా 16-09-2022 శుక్రవారం రోజున వారం సంతను (అంగడి)ని ఆరాధ్య డెవలపర్స్ లోని స్థలంలో సంతను ఏర్పాటుచేయడంజరిగింది.

వినాయక శోభయాత్రలో పాల్గొన్న సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్

Submitted by sudhakar on Thu, 15/09/2022 - 11:38

అడ్డగూడూరు సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి న్యూస్) .స్థానిక అడ్డగూడూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర (ఎస్ వి ఆర్) వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ గణేష్ నవరాత్ర ఉత్సవాలు ముగియడంతో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా లడ్డూ లక్కీ డ్రా కూపన్ తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రా లో  సామ యాదిరెడ్డి దంపతులు15 కేజీల లడ్డును గెలుచుకోవడం జరిగింది.

గట్టుసింగారంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ

Submitted by sudhakar on Thu, 15/09/2022 - 11:35

అడ్డగూడూరు సెప్టెంబర్ 14 ( ప్రజా జ్యోతి) . తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం గట్టుసింగారం లో నూతన ఆసరా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది.

నూతన ఆసరా పింఛన్ల పంపిణీ

Submitted by sudhakar on Thu, 15/09/2022 - 11:03

అడ్డగూడూరు సెప్టెంబర్ 14 ప్రజా జ్యోతి ) .తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం నూతన ఆసరా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి MPP దర్శనాలు అంజయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోమ్మిడి ప్రభాకర్ రెడ్డి, ZPTC శ్రీరాములు జ్యోతి అయోధ్య,  PACS చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ మద్ది సత్తయ్య,  గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నాల నవీన్ కుమార్  గ్రామ పంచాయతీ కార్యదర్శి చెరుకు నవీన్, మద్ది వెంకన్న బుల్లెట్, పిట్టల సైదులు, పనుమట్టి ప్రభుదాస్, ముప్పిడి సైదులు, వజ్జా సతీష్, అల్వాల బాబు, సీనియర్ నాయకులు జూలెన్ రెడ్డి, చెర్కులచ్చయ్

స్నేహిత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి

Submitted by sudhakar on Thu, 15/09/2022 - 10:52

అడ్డగుడూర్ సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి  న్యూస్)స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల లో జరిగిన స్నేహిత , బుధవారం బోధన , పోషన్ మాసం కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి , జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీ దీపక్ తివారీ  పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్నేహిత కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని , పిల్లలు వారి రక్షణ పట్ల జాగ్రత్త తీసుకుంటున్నారన్నారు.

కొత్త పార్లమెంట్ భవనం పేరు బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ పేరు పెట్టాలి

Submitted by sudhakar on Tue, 13/09/2022 - 20:17
  •  చిప్పలపల్లి మహేంద్ర నాథ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కూరు

అడ్డగూడూర్ సెప్టెంబర్ 13( ప్రజా జ్యోతి న్యూస్) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గపేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షనీయంచరిత్రాత్మక నిర్ణయమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్ అన్నారు.

అడ్డగూడూర్ మండల కేంద్రంలో నూతన సంత ( అంగడి ) ఏర్పాటు

Submitted by sudhakar on Tue, 13/09/2022 - 10:50
  • నూతన సంత కరపత్రాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ ఎం పి టి సి

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 12 ( ప్రజా జ్యోతి ) అడ్డ గూడూరు మండల కేంద్రంలో శుక్రవారం సంత (అంగడి)ఏర్పాటు చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము అని  పరిసర ప్రాంత ప్రజలు అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసే వారం సంత( అంగడి ) లో పండ్లు కూరగాయలు ఆకుకూరలు గొర్లు మేకలు మరియు పశువులను అమ్మకం మరియు కొనుగోలు చేసుకోవచ్చు అని అడ్డగూడూరు మండల పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అమ్మకాలు కొనుగోలు చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది కావున అట్టి సమస్య లేకుండా మన దగ్గర మంచి తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు మేకలు పశువులను కొన

గురుకుల పాఠశాలలో మొక్కలు నాటిన ఎంపీపీ, జడ్పిటిసి

Submitted by sudhakar on Sat, 10/09/2022 - 14:03

అడ్డగూడూరు  సెప్టెంబర్ 9 ( ప్రజా జ్యోతి న్యూస్)  అడ్డగూడూరు మండలం  మంగమ్మగూడెం గురుకుల పాఠశాలలో  స్వచ్ఛ గురుకుల్ 5వ రోజు  హరితహారం కార్యక్రమంలో భాగంగా 620 మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య,జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య,స్పోర్ట్స్ ఆఫీసర్ శేషుకుమారి,ప్రిన్సిపాల్ రూప,సర్పంచ్ త్రివేణి దుర్గయ్య,ఎంపిటిసి కో ఆప్షన్ సభ్యులు మాధాను అంథోనిబాలెంల అరవింద్TRSV తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి,పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షులు మందుల కిరణ్ టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి, దర్శనలా మహేందర్,పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.