అడ్డగూడూరు మండలంలో వార సంత అంగడి ఏర్పాట్లు

Submitted by sudhakar on Thu, 15/09/2022 - 15:50
 Weekly Santa Angadi arrangements in Addagudur mandal

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి .అడ్డగూడూర్ మండలంలో గల రేపటి వారం సంతను (అంగడి)ని విజయవంతం చేయండి.సంతలో ముందు వరుసలో పండ్ల, కూరగాయల దుకాణాలు.వెనుక వరుసలో పశువుల,మేకల, గొర్రెల,కోళ్ళ కోనుగోలు కేంద్రం తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం రేపు అనగా 16-09-2022 శుక్రవారం రోజున వారం సంతను (అంగడి)ని ఆరాధ్య డెవలపర్స్ లోని స్థలంలో సంతను ఏర్పాటుచేయడంజరిగింది. అడ్డగూడూర్ పట్టణ కేంద్రంతోపాటు 16 గ్రామ పంచాయతీల పరిసర ప్రాంతంలోని అన్ని రకాల బేరగాళ్ళు,చిరు వ్యాపారులు పండ్ల కూరగాయల వ్యాపారులు పశువుల,మేకల , గొర్రెల,చేపల వ్యాపారులు మరియు ప్రజాప్రతినిధులు రైతులు,వివిధ పార్టీల మండల అధ్యక్షులు,గ్రామశాఖ అధ్యక్షులు,యువజన సంఘాల నాయకులు, యువకులు,మహిళలు రేపు ఉదయం 10 గంటల వరకు అడ్డగూడూర్ లోని ఆరాధ్య డెవలపర్స్ లోగల సొంత స్థలానికి రాగలరు వారం సంతను (అంగడి)ని అన్ని హంగులతో వసతులతో వ్యాపారులకు,వినియోగ దారులకు ఎలాంటిఇబ్బందులు తలెత్తకుండా వారం సంతలో అన్ని ఒకే దగ్గర ఉండే విధంగా నూతన వారం సంతకు(అంగడి)కివచ్చినవినియోగదారులందరికి  అన్ని వస్తువులు లభించే విధంగా ఆరాధ్య డెవలపర్స్ లో గల స్థలంలో టెంట్ లువేసి,నీటి వసతిలాంటి సదుపాయాలతో ముఖ్యంగా వినియోగ దారులకు, వ్యాపారులకు,మహిళా వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారం సంతను (అంగడిని) ఏర్పాటు చేయడం జరిగింది.

దయచేసి మండలంలోని ప్రజలతోపాటు మీకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారులను అడ్డగూడూర్ వారం సంతకు (అంగడి)కీ వచ్చే లాగ తమ వంతు సహాయ సహకారాలు అందించగలరు.ఈ వారం సంతను అందరు సకాలంలో వచ్చి విజయవంతం చేయగలరని మా యొక్క మనవి వారం సంత (అంగడి) ఏర్పాటు చేయు స్థలం  ఆరాధ్య డెవలపర్స్ మోత్కూరు రోడ్ అడ్డగూడూర్ మండలం బాలెంల త్రివేణిదుర్గయ్య సర్పంచ్ పెండల భారతమ్మ ఎల్లయ్య ఎం పి టి సివడకాల రణధీర్ రెడ్డిఉప సర్పంచ్  అడ్డగూడూర్ పాలక వర్గం సభ్యులు