అడ్డగూడూర్ మండల కేంద్రంలో నూతన సంత ( అంగడి ) ఏర్పాటు

Submitted by sudhakar on Tue, 13/09/2022 - 10:50
Establishment of a new Santa (Angadi) in Addagudur mandal center
  • నూతన సంత కరపత్రాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ ఎం పి టి సి

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 12 ( ప్రజా జ్యోతి ) అడ్డ గూడూరు మండల కేంద్రంలో శుక్రవారం సంత (అంగడి)ఏర్పాటు చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము అని  పరిసర ప్రాంత ప్రజలు అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసే వారం సంత( అంగడి ) లో పండ్లు కూరగాయలు ఆకుకూరలు గొర్లు మేకలు మరియు పశువులను అమ్మకం మరియు కొనుగోలు చేసుకోవచ్చు అని అడ్డగూడూరు మండల పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అమ్మకాలు కొనుగోలు చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది కావున అట్టి సమస్య లేకుండా మన దగ్గర మంచి తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు మేకలు పశువులను కొనుగోలు చేసి మీరు ఇట్టి అంగడి ని సద్వినియోగం చేసుకోగలరు మరియు మండల అభివృద్ధికి తోడ్పడగలరు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ త్రివేణి దుర్గయ్య ఎంపీటీసీ భారతమ్మ ఉప సర్పంచ్ రణధీర్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామస్తులు ఇతర గ్రామాల వారు అధికారులు తదితరులు పాల్గొన్నారు