Addagudur

నిరుపేద మహిళకు ఆర్థికంగా అండగా నిలిచిన బాలెంల సైదులు

Submitted by sudhakar on Sat, 24/09/2022 - 12:36

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి న్యూస్):  అడ్డగూడూరు పట్టణ  కేంద్రంలో ఇటీవలే ఏర్పాటుచేసిన  అంగడి (సంత) లో  కూరగాయలు పెట్టుకొని జీవనం సాగించడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులో ఉన్న అడ్డగూడూరు పట్టణ కేంద్రానికి చెందిన   బండి మంజుల అనే నిరుపేద మహిళలకు ఆర్థికంగా బాలెంల సైదులు అండగా నిలిచారు. అడ్డగూడూర్ పట్టణానికి  చెందిన  బండి మంజుల అనే నిరుపేద మహిళకు రూ.5000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ డబ్బులతో ఆ మహిళా కూరగాయలు తెచ్చుకొని వారం వారం శుక్రవారం నాడు అడ్డగూడూరులో ఏర్పాటు చేసే  సంతలో కూరగాయల వ్యాపారం ప్రారంభించింది.

డప్పు చంద్రయ్య కు నివాళులు అర్పించిన సర్పంచ్

Submitted by sudhakar on Fri, 23/09/2022 - 12:05

  అడ్డగూడూర్ సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి న్యూస్):  అడ్డగుడూర్ మండలం మంగమ్మగూడెం గ్రామానికి చెందిన డప్పు చంద్రయ్య వయస్సు 57 అకాల మరణాన్ని చింతిస్తూ వారి పార్థివ దేహానికి నివాళి అర్పించిన అడ్డగుడూర్ సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య వారితో పాటు గజ్జెలీ రవి  అడ్డగుడూర్ మండల యువ నాయకులు బాలెంల నరేందర్ బాలెంల నరేష్ బాలెంల సోమయ్య బాలెంల బాలస్వామి  అన్నం వెంకన్న బయ్య బిక్షం డప్పు వెంకన్న డప్పు ముత్తయ్య డప్పు బాలయ్య డప్పు దుర్గయ్య డప్పు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు*

పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన; ఎంపీపీ దర్శనాల అంజయ్య

Submitted by sudhakar on Tue, 20/09/2022 - 17:09

అడ్డగుడూర్ సెప్టెంబర్ 20 ( ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూర్ మండల కేంద్రంలో నవ తెలంగాణ పత్రిక విలేకర్  పరిగెల కనకయ్య తండ్రి నర్సయ్య మరణించడం జరిగింది. మంగళవారం వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. ఈ కార్యక్రమంలోఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పిటీసీ శ్రీరాముల జ్యోతి అయోద్య, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్  అవినాష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

 

టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

Submitted by sudhakar on Mon, 19/09/2022 - 16:00

అడ్డగుడూర్ సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి) న్యూస్../ అడ్డగూడూరు మండల కేంద్రంలో గిరిజనులకు 10% రిజ్వేషన్ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభత్వానికి ఈ నిర్ణయం ద్రారానైనా మీ వైఖరి మానుకొని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ మీద బీజేపీ ప్రభుత్వానికి వివక్ష ఎందుకని, గిరిజన రిజర్వేషను ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నించారు.

తెలంగాణ సాయుధపోరాట అమరులకు నివాళులు

Submitted by sudhakar on Mon, 19/09/2022 - 12:10

 అడ్డగూడూరుసెప్టెంబర్18 ( ప్రజా జ్యోతి) .. / అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కామ్రేడ్ మందుల చంద్రయ్య ఆలియాస్ లేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ మందుల సామేలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి అరాచకాలను రజాకార్లను పోలీసులను ఎదురించి పోరాటం చేసి నైజాం పరిపాలను గద్దెదించిన పోరాటం లేవి తన గ్రామవాసీకావడం గర్వంగా ఉందన్నారు.

జన్మదిన వేడుకలో పాల్గొన్న ఇటికాల చిరంజీవి

Submitted by sudhakar on Mon, 19/09/2022 - 12:00

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 18 ( ప్రజా జ్యోతి ) .. అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్లరామరం సర్పంచ్ నిమ్మనగొటి జోజి  మనుమడు రిత్విక్ మొదటి పుట్టిన రోజు వేడుకకు భువనగిరి ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్దకు హాజరై చిన్నారుని ఆశీర్వదించిన ఉమ్మడి నల్గొండ జిల్లా టెలికామ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి  ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ అడ్డగుడూరు మండల ఉపాధ్యక్షుడు పురుగుల మల్లేష్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుకూనూరి విష్ణువర్ధన్ రెడ్డి  యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సురారం నవీన్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

అడ్డగూడూరులో నూతన అంగడి (సంత)ను ప్రారంభిస్తున్న ఎంపీపీ జడ్పిటిసి

Submitted by sudhakar on Sat, 17/09/2022 - 11:51

అడ్డగూడూర్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి  న్యూస్ . స్థానిక అడ్డగూడూర్ మండల కేంద్రంలో నూతన అంగడి (సంత)ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల ఎంపీపీ దర్శనల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య ,ముఖ్య అతిధులుగా హాజరై  ప్రారంభించినారు ఈ సందర్భంగా

నిరుపేద మహిళకు ఆర్థికంగా అండగా నిలిచిన బాలెంల సైదులు

Submitted by sudhakar on Sat, 17/09/2022 - 11:43

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి . అడ్డగూడూరు మండలంలో నూతనంగా అంగడి (సంత) ఏర్పాటు చేశారు. దీంతో ఆ యొక్క సంతలో కూరగాయలు పెట్టుకొని జీవనం సాగించడానికి ఆర్థిక స్తోమత లేక దీన స్థితిలో ఉన్న  ఓ ఒంటరి నిరుపేద మహిళలకు ఆర్థికంగా బాలెంల సైదులు అండగా నిలిచారు. మండల కేంద్రానికి చెందిన కురిమిళ్ళ ఏసుమని అనే నిరుపేద మహిళకు రూ.5000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ డబ్బులతో ఆ మహిళా కూరగాయలు తెచ్చుకొని శుక్రవారం అడ్డగూడూరులో ఏర్పాటుచేసిన సంతలో కూరగాయల వ్యాపారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందజేసిన బాలెంల సైదులుకు ఆ మహిళా కృతజ్ఞతలు తెలియజేసింది.

తెరాస పార్టీ ఆధ్వర్యంలో కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by sudhakar on Fri, 16/09/2022 - 12:01


 అడ్డగూడూర్ సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి న్యూస్ .అడ్డ గూడూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర నూతన సెక్రటేరియట్ భవనానికి భారత రత్న డా బాబాసాహెబ్ అంబేడ్కర్  పేరును పెట్టడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ అడ్డగూడూరు మండల కేంద్రంలో కేసిఆర్  చిత్రపటానికి క్షిరాభిషేకం చేయడం జరిగింది

బిజెపి ,కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి బారి చేరికలు

Submitted by sudhakar on Fri, 16/09/2022 - 11:49

అడ్డగూడూర్ సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి  న్యూస్). స్థానిక అడ్డగూడూరు మండలం పరిధిలోని వెల్దేవి గ్రామంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి పలువురు యువ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తీపిరెడ్డి మెగా రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో  చేరడం జరిగింది. ఈ సందర్భంగా మెగారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి వచ్చిన వారందరికీ స్వాగతం తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టిఆర్ఎస్ పార్టీ ముందుండి వారిని ఆదుకుంటుందని తెలిపారు.