జనగావ్

సాయిధ పోరాటం పై బిజెపి విష ప్రచారం మానుకోవాలి

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:17
  • చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సభలో సిపిఎం నాయకులు 

పాలకుర్తి, సెప్టెంబర్ 10, ప్రజాజ్యోతి :- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పై బిజెపి విష ప్రచారం మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి. కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి వెంకటరాజ్యంలు అన్నారు. శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్ చౌరస్తాలో సిపిఎంఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

46వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె

Submitted by sridhar on Thu, 08/09/2022 - 15:50

బచ్చన్నపేట సెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి): తమ న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వీఆర్ఏల సమ్మె బచ్చన్నపేట లో గురువారం నాటికి 46వ రోజుకు చేరుకుంది. వీఆర్ఏల గౌరవాధ్యక్షులు నరసింగ బాలకృష్ణ మండల అధ్యక్షులు ఎద్దు రామకృష్ణ ల ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం నుండి కెసిఆర్ చౌరస్తా వరకు బైక్ లపై పలు డిమాండ్ తో కూడిన నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు మాచర్ల నర్సయ్య మృతి

Submitted by sridhar on Wed, 07/09/2022 - 19:48

దేవరుప్పుల, సెప్టెంబర్ 07, ప్రజాజ్యోతి:- వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మాచర్ల నర్సయ్య (110) అనారోగ్యంతో మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని  కొల్కొండ గ్రామానికి చెందిన మాచర్ల నర్సయ్య ఆనాటి వీర తెలంగాణ రైతాంగ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం నిరంకుశ పాలనకు, విస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి  ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. దేశ్ముక్ వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ (కమ్యూనిస్టు పార్టీ) ఏర్పాటు చేసి వెట్టిచాకిరికి వ్యతిరేకంగా గ్రామంలోని ప్రజలు పోరాటాలకు సిద్ధం కావడంతో విస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అనేకసార్లు కొల్కొండ గ్రామంపై దాడులు చేయించాడు.

గణపతి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

Submitted by sridhar on Wed, 07/09/2022 - 17:17

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 07 (ప్రజాజ్యోతి ) :-  స్టేషన్ ఘణపూర్ మండలంలోని ఇంద్రనాగర్ కాలనీలో, చిల్పుర్ మండలంలోని రాజవరం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం లో పాల్గొని భక్తులకు అన్నదానంలో భాగంగా అన్నం ఒడ్డించారు.

తాగునీటి కోసం బోరు వేయించిన ఎంపీపీ

Submitted by sridhar on Wed, 07/09/2022 - 16:58

బచ్చన్నపేట సెప్టెంబర్ 7 ప్రజా జ్యోతి ; మండలంలోని గోపాల్ నగర్ గ్రామపంచాయతీ బేడ బుడగ జంగాల కాలనీలో మంచినీటి సమస్య ఉన్నదని చెప్పగానే ఎంపీపీ నిధులతో బోరు వేయించినట్లు ఎంపీపీ భావన నాగజ్యోతి కృష్ణంరాజు తెలిపారు బుధవారం గోపాల్ నగర్ గ్రామ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఇరీ రమణారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య ఎంపిటిసి గుర్రాల నర్సిరెడ్డి కోఆప్షన్ సభ్యులు షబ్బీర్ ఉపసర్పంచి వద్ది ఎల్లయ్య.

నియోజకవర్గ యువత ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

Submitted by sridhar on Wed, 07/09/2022 - 15:56

స్టేషన్ ఘనపూర్ (చిల్పూరు) సెప్టెంబర్ 07, ప్రజాజ్యోతి :- 
 చిల్పూర్ మండల కేంద్రంలో ఈనెల 11న నియోజకవర్గ కేంద్రంలో జరగబోయే  నియోజకవర్గ యువత ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం కోసం సన్నాహక సమావేశాన్ని బుధవారం టి ఆర్ ఎస్ మండల యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు .

తెలంగాణ రాష్ట్ర మోడల్ పాఠశాల,కళాశాలలో ఎఐఎస్ఎఫ్ ఆకస్మిక తనిఖీలు

Submitted by sridhar on Tue, 06/09/2022 - 17:19

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 06 (ప్రజాజ్యోతి ) :- స్టేషన్ ఘనపూర్  మండలం లోని నమిలిగొండ గ్రామంలోని మోడల్ పాఠశాల, కళాశాలలో సమస్యలపైన తనిఖీలు చేపట్టారు. ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింత.జగదీదీష్ జిల్లా అధ్యక్షులు, పాస్థం పృథ్వి జిల్లా నాయకులు, ఎండీ యోనొస్ వెళ్ళి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు . చింత జగదీష్ మాట్లాడుతూ కనీసం పాఠశాలలో నీటి సౌకర్యం లేదని, నాణ్యమైన బోజన సౌకర్యం లేక పిల్లలు ఇంటి నుండే బోజనాలు తెచ్చుకుంటున్నారని, అలాగే క్లాస్ రూమ్ పక్కనే మూత్రశాలలు ఉండటం పరిశుభ్రంగా లేకపోవడంతో పిల్లలు అవస్థ పడుతున్నారాని వాపోయారు.

రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయండి

Submitted by sridhar on Tue, 06/09/2022 - 17:08
  • సెప్టెంబర్ 17న జనగామకు సీతారాం ఏచూరి రాకా
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పిలుపు

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 06 (ప్రజాజ్యోతి) :- తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 17న జనగామకు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రానున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ తెలిపారు. మంగళవారం ఘనపూర్ డివిజన్ కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో పొలసు పరమేష్ అధ్యక్షతన జరిగింది.

ముదిరాజుల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కెసిఆర్

Submitted by sridhar on Mon, 05/09/2022 - 15:30
  • రూ. 25 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన 
  • ఘనపూర్ రిజర్వాయర్ లోకి 9,26,000 చేపపిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ , ఎమ్మెల్యే డా.రాజయ్య

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 05 (ప్రజాజ్యోతి ) :-  స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో  సోమవారం నిర్వహించిన  కార్యక్రమాలలో ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ఎనిమల్ హస్బండ్రీ , మత్స్య , డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య పాల్గొన్నారు .