జనగావ్

ఆలయ ప్రథమ వార్షికోత్సవ కరపత్రాల విడుదల

Submitted by lenin guduru on Thu, 20/10/2022 - 18:10

ఆలయ ప్రథమ వార్షికోత్సవ
కరపత్రాల విడుదల

-ఆలయ గౌరవ అధ్యక్షుడు మచ్చ నరేందర్

బచ్చన్నపేట. అక్టోబర్ 20, (ప్రజాజ్యోతి)
మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయ ప్రధమ వార్షికోత్సవ కరపత్రాలను విడుదల చేసినట్లు దేవాలయ కమిటీ శాశ్వత గౌరవ అధ్యక్షుడు మచ్చ నరేందర్, ఉపాధ్యక్షులు గుర్రపు బాలరాజు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఆలయ ప్రాంగణంలో కరపత్రాలను
విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ మూడవ తేదీ నుండి 4వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ వార్షికోత్సవానికి భక్తులు

ప్రతి మహిళకు బతుకమ్మ చీరె అందాలి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

Submitted by lenin guduru on Fri, 23/09/2022 - 13:23

జనగామ , సెప్టెంబర్ 22, ప్రజాజ్యోతి :- జిల్లాలో  ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందజేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నియోజకవర్గ అధికారులు జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

మర్డర్ కేసులో ఒక వ్యక్తి రిమాండ్.. సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి

Submitted by bosusambashivaraju on Wed, 14/09/2022 - 17:39

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి ) :- మర్డర్ కేసులో భాగంగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఘటన బుధవారం స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్టేషన్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం  స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన లింగబోయిన యాదగిరి తన భార్య అయినటువంటి లింగబోయిన సరితపై ఈనెల 3-9 -2022 రోజు రాత్రి కుటుంబ కలహాలతో గొడ్డలితో దాడి చేసి తలపైన  కొట్టారు. తీవ్ర గాయాలైనటువంటి లింగబోయిన సరితను వారి పెద్ద కుమారుడైన లింగబోయిన నవీన్ ఎంజీఎం హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.

దేవర్పుల బస్టాండ్ ను పరిశీలించిన ఆర్టీసీ విజిలెన్స్ పోలీసులు

Submitted by sridhar on Tue, 13/09/2022 - 11:30
  • బస్టాండ్ స్థలాన్ని పరిశీలించి వాస్తవ నివేదిక అందజేస్తాం
  • డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎం రామమూర్తి

టీ ఎస్ యూ టి ఎఫ్ ఆధ్వర్యంలో 13న చలో అసెంబ్లీ

Submitted by sridhar on Mon, 12/09/2022 - 15:57

టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి : పత్తి వెంకటాద్రి

కొడకండ్ల (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 12 : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 13న టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టి ఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పత్తి వెంకటాద్రి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ యూత్ నాయకుల ముందస్తు అరెస్ట్

Submitted by sridhar on Mon, 12/09/2022 - 15:53

దేవరుప్పుల సెప్టెంబర్12, ప్రజాజ్యోతి:- రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా వీఆర్ఏలు తహశీల్ధారు  కార్యాలయాల ముందు  నిరసన దీక్షలు చేపడుతుండగా అందులో భాగంగా ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వని యెడల అసెంబ్లీ ముట్టడి చేస్తామని విఆర్ఏలు తెలిపగఅందుకు విఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడికి సిద్దంగా ఉన్న దేవరుప్పుల మండల కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ముందస్తుగా సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్ కు తరలించారు.అరెస్టు అయిన వాళ్ళలో మండల యూత్ కాంగ్రెస్ అధ

ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:43
  • సీపీఐ (యంయల్ ) రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా

పాలకుర్తి: సెప్టెంబరు 10, ప్రజాజ్యోతి :తెలంగాణ వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని సీపీఐ (యంయల్ ) రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆదివారం  మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ కుటుంబ సభ్యులతో కలిసి 37 వ వర్ధంతిని నిర్వహించారు. ఐలమ్మ స్మారక స్థూపం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని అన్నారు.

జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలి

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:28
  • రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ 

పాలకుర్తి, సెప్టెంబర్ 10, ప్రజాజ్యోతి:- జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి  మదర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఐలమ్మ 37 వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఐలమ్మ స్తూపానికి ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఐలమ్మ వారసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వీరనారి చిట్యాల ఐలమ్మ ఆశయాలు కొనసాగిద్దాం

Submitted by bosusambashivaraju on Sat, 10/09/2022 - 17:24

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 10 (ప్రజాజ్యోతి ) :- స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సిపిఎం కార్యాలయంలో శనివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పార్టీ మండల కమిటీ సభ్యులు దైద రాములమ్మ, సిద్ధుల సుదర్శన్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలు అని అన్నారు.

ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:21

బచ్చన్నపేట సెప్టెంబర్ 10 ప్రజా జ్యోతి: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకా లను చూసే పలు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నా రని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్ర వారం మండలంలోని పడమటికేశ్వపూర్కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు చల్లా శ్రీనివాస్ రెడ్డి, చల్ల తిరు పతిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సంద వారికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఇంటింటికీ టీఆర్ఎస్ ప్రభు త్వ పథకాలు అందాయన్నారు.