మర్డర్ కేసులో ఒక వ్యక్తి రిమాండ్.. సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి

Submitted by bosusambashivaraju on Wed, 14/09/2022 - 17:39

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి ) :- మర్డర్ కేసులో భాగంగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఘటన బుధవారం స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్టేషన్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం  స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన లింగబోయిన యాదగిరి తన భార్య అయినటువంటి లింగబోయిన సరితపై ఈనెల 3-9 -2022 రోజు రాత్రి కుటుంబ కలహాలతో గొడ్డలితో దాడి చేసి తలపైన  కొట్టారు. తీవ్ర గాయాలైనటువంటి లింగబోయిన సరితను వారి పెద్ద కుమారుడైన లింగబోయిన నవీన్ ఎంజీఎం హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.

 వారి కొడుకు లింగబోయిన నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దరఖాస్తు స్వీకరించి కేసు నమోదు చేశారు. ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లింగబోయిన సరిత 13-9-2022 రోజున హాస్పిటల్ లో చనిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో మరణించారు. ఈ మరణానికి కారణమైన లింగబోయిన యాదగిరిపై మర్డర్ కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించారు . ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎస్సై  బండి శ్రావణ్ కుమార్, ఏఎస్ఐ రాజమౌళి,  స్టేషన్ రైటర్ శ్రీనివాసరావు,  కానిస్టేబుల్ కుమార్,  మోహన్ పాల్గొన్నారు.