సూర్యాపేట్

ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ

Submitted by Upender Bukka on Sun, 25/09/2022 - 12:41

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 24సెప్టెంబర్..//.. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగగా  బతుకమ్మ పండుగ నిలుస్తుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ జి .పద్మ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని జడ్పీహెచ్ఎస్   పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూసంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని తెలిపారు. ప్రపంచంలో ఏ పండుగలలో  ప్రకృతిని పూజించరని  ప్రకృతిని, పూలను ఆరాధిస్తూ కొలిచే పండుగ బతుకమ్మ పండుగ అని అది కేవలం తెలంగాణ జాతికే సొంత మని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు పోతరాజు వేషాలతో అలరించారు .

ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ అధ్యక్షునిగా వలివేటి వీరభద్ర శర్మ

Submitted by Upender Bukka on Sat, 24/09/2022 - 11:27

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 23సెప్టెంబర్ ,,./  ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ అధ్యక్షునిగా వలివేటి వీరభద్ర శర్మను నియమిస్తూ  రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్  గంగు ఉపేంద్ర శర్మ  గురువారం ఉత్తర్వులు  జారీ చేశారు. ఈ సందర్భంగా  ఉమ్మడి నల్గొండ జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు వలివేటి వీరభద్ర శర్మ మాట్లాడుతూతన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్ర చార్యులు, రాష్ట్ర ఉద్యోగ  సంఘం అధ్యక్షులు  తాండూరి కృష్ణమాచారి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

నియోజక వర్గం డెలిగేట్ గా రమేష్ రెడ్డి ఎంపిక హర్షనీయం.... కౌన్సిలర్ వెలుగు వెంకన్న

Submitted by Upender Bukka on Thu, 22/09/2022 - 14:49

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 21సెప్టెంబర్.../../సూర్యాపేట నియోజకవర్గం నూతన డెలిగేటుగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఎంపిక పట్ల 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. పటేల్ రమేష్ రెడ్డిని నూతన డెలిగేటుగా ఎంపిక కు సహకరించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాహూల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర వలన ప్రజలలో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.

పీసీసీ డెలిగేట్ గా పటేల్ రమేష్ రెడ్డి

Submitted by Upender Bukka on Thu, 22/09/2022 - 14:39

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 21సెప్టెంబర్ //.// ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు త్వరలో జరగనున్న  నేపథ్యంలో సూర్యాపేట నియోజకవర్గం డెలిగేట్ గా టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ...... దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా  కోరుకుంటున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు  దేశ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. భారత దేశ రాజకీయ మార్పునకు జోడయాత్ర సంకేతమని తెలిపారు. నియోజకవర్గ డెలిగేటుగా ఎంపికైన ఆయనకు కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తింపు కార్డును జారీ చేసింది.

భారతదేశం ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి ఆధారంగా మారబోతుంది

Submitted by Upender Bukka on Thu, 22/09/2022 - 14:35

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 21సెప్టెంబర్.../../  అపారమైన యువ జనాభాతో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ  బ్రిటన్ ను అధిగమించబోతుందని భారతదేశం ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి ఆధారంగా మారబోతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.   లక్ష్మీ తండ గ్రామానికి చెందిన పలువురు తెరాస  నాయకులు బుదవారం  ఆయన నివాసంలో   బిజెపి పార్టీలో చేరారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నియంతృత్వ పోకడల వలన తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు.

ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

Submitted by Upender Bukka on Thu, 22/09/2022 - 14:26

ప్రజా జ్యోతి సూర్యాపేట జిల్లా ప్రతినిధి 21సెప్టెంబర్.././రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని,రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని విద్యుత్ శాఖ మంత్రి గుంట జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు కార్మికులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భావులకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన కేసీఆర్ తన ప్రాణం ఉన్నంతవరకు ఆ కార్యక్రమం చేయబోనని కేంద్ర ప్రభుత్వానికి ఖరాఖండిగా చెప్పారని పేర్కొన్నారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని తెలిపారు.

పంటల దిగుబడిని అంచనా వేయాలి... జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్

Submitted by Upender Bukka on Wed, 21/09/2022 - 12:19

ప్రజా జ్యోతి సూర్యాపేట జిల్లా ప్రతినిధి 20సెప్టెంబర్.../  పంటల దిగుబడిని విశ్వసనీయంగా అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. మంగళవారం  జిల్లా కలెక్టర్ సమావేశ కార్యాలయంలో  నిర్వహించిన పంట కోత ప్రయోగముల ,ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూపంటకోత ప్రయోగాలను ప్రతి ఒక్కరు సక్రమంగా నిర్వహించాలని , ఖచ్చితమైన సమాచారంతో పంటకోత ప్రయోగముల ఫారాలను నింపి సకాలంలో వాటిని పంపాలని గణాంక అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించారు.