సూర్యాపేట్

కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించిన కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్

Submitted by Upender Bukka on Thu, 29/09/2022 - 13:11

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 28 సెప్టెంబర్,../ సూర్యాపేట పట్టణంలో ఫన్ విల్లే కిడ్స్ ప్లే జోన్ 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ తో కలిసి 44వ వార్డు కౌన్సిలర్ కెక్కిరేని  శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పిల్లలు పాఠశాలలో చదువుతోపాటు  క్రీడలు, వినోదాలు చిన్నారుల మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కిడ్స్ ప్లే జోన్ లో చిన్నారులకు బాల్ పూల్ స్పైడర్, సాఫ్ట్ ప్లే, జంపింగ్ బాల్స్, కిచెన్ రూమ్, ప్లే మినీ కార్, రాకర్స్, ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఆడబిడ్డల కు ప్రేమ పూర్వక కానుక బతుకమ్మ చీర

Submitted by Upender Bukka on Wed, 28/09/2022 - 10:00

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 27సెప్టెంబర్ .///..సూర్యాపేట పట్టణంలోని 39 వ  వార్డులో  టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మొరిశెట్టి  శ్రీనివాస్ మంగళ వారం  వార్డు ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన   నాటి నుంచి తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ  రాష్ట్రం  ఏర్పడిన అనంతరం బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందని తెలిపారు.

మద్యం ఆదాయం పెంచుకోవడం పై తెరాస ప్రభుత్వం దృష్టి... బిజేపి నేతల ఫైర్

Submitted by Upender Bukka on Wed, 28/09/2022 - 09:46

ప్రజా జ్యోతి సూర్యాపేట జిల్లా ప్రతినిధి 27 సెప్టెంబర్.//.//.విద్య వైద్య రంగాలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయం పై దృష్టి సారించిందని సూర్యాపేట జిల్లా బిజేపి నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్ ఆధ్వర్యంలో సంకినేని నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. 2014 ఎన్నికలలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు ఎకరాల భూమి హామీని నెరవేర్చలేదని అన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీ

Submitted by Upender Bukka on Wed, 28/09/2022 - 08:30

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 27సెప్టెంబర్.//.... సూర్యాపేట శాసనసభ్యులు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం 19వ వార్డు ఆడపడుచులకు  తెరాస కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్ చేతుల మీదగా  చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు అంజిరెడ్డి, నాగచారి, యాదగిరి, సీతారాములు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

Submitted by Upender Bukka on Tue, 27/09/2022 - 16:15

ప్రజా జ్యోతి క్రైమ్ సూర్యాపేట 26సెప్టెంబర్//;;; సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది అత్త మామ వేధింపులు తాళలేక ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా గాజులంక గ్రామానికి చెందిన సనక వాసవి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వాసవి భర్త సనక శ్రీకాంత్  సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్బిఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆడపిల్లలు పుట్టారని అదనపు కట్నం తెమ్మని అత్త మామ వేధిస్తుండడంతో మానసిక సంఘర్షణకు లోనై వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. వివాహిత ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట డిఎస్పి నాగభూషణం తెలిపారు.

బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ

Submitted by Upender Bukka on Tue, 27/09/2022 - 15:55

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 26సెప్టెంబర్.///..బతుకమ్మ పండుగ ప్రకృతి పండగని 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే  భారతదేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉందని , అలాంటి పండుగలలో   తెలంగాణలో మాత్రమే జరుపుకునే  బతుకమ్మ పండుగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పుతోందని పేర్కొన్నారు. అనంతరం వార్డు మహిళలతో కోలాటాలు వేస్తూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.

23 వ వార్డులో స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి దర్శనం

Submitted by Upender Bukka on Tue, 27/09/2022 - 15:40

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 26 సెప్టెంబర్ .///..దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 23వ వార్డు రాజీవ్ నగర్ లో శ్రీ స్వర్ణ కవచలాం కృత దుర్గాదేవి గా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన వారిలో  గోనె విజయ, రేబేల్లి సుజాత కడియం విజయ, బుక్క విజయ ,రమ్య ఉన్నారు. అనంతరం అమ్మవారు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నారు.

7 వ వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ

Submitted by Upender Bukka on Tue, 27/09/2022 - 15:33

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 26సెప్టెంబర్.//... స్థానిక శాసనసభ్యులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం సూర్యాపేట పట్టణంలోని ఏడవ వార్డులో కౌన్సిలర్  కుంభం రేణుక ,రాజేందర్ చేతుల మీదుగా  వార్డు ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. వార్డు ప్రజలు ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

27 లక్షల విలువగల గంజాయి సీజ్

Submitted by Upender Bukka on Sun, 25/09/2022 - 13:11

ప్రజా జ్యోతి సూర్యాపేట జిల్లా ప్రతినిధి 24సెప్టెంబర్//''///  నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాలనుసారం జిల్లా పోలీస్ యంత్రాంగం ముమ్మర తనిఖీల భాగంగా హుజూర్నగర్ మోతే కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 27 లక్షల విలువ గల గంజాయిని  అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూమోతే పోలీస్ స్టేషన్ పరిధిలో 138 , హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్, 93  కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ల  పరిధిలలో 37 కేజీల గంజాయిను సీజ్ చేశామని తెలిపారు. అదేవిధంగా రెండు షిఫ్ట్ కార్లు ఒక ఐ20 కారును నిందితుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.