బచ్చన్నపేట మండలం లో పద్మశాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ

Submitted by narmeta srinivas on Mon, 24/10/2022 - 19:50
జనగామ,బచ్చన్నపేట

మోదీజి చేనేత వస్త్రాలపై  జీఎస్టీ నీ ఎత్తి వేయండి

పోస్ట్ కార్డు ద్వారా తమ గోస ను రాసి పంపిన చేనేత కార్మికులు

బచ్చన్నపేట, అక్టోబర్ 24 ప్రజా జ్యోతి : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో (చేనేత) పద్మశాలి  సంఘం నాయకుల ఆధ్వర్యంలో  చేనేత వస్త్రాలపై జిఎస్టి ఎత్తివేయాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీ కి 500 లెటర్లు రాసి గోపాల్ నగర్ గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ గ్రామపంచాయతీ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ తాతల కాలం నుండి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను విధించలేదని, మోదీ  కేంద్ర ప్రభుత్వము  చేనేతకు వాడే ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై 5 శాతం జిఎస్టి విధించి, దాన్ని 12 శాతానికి పెంచాలనుకోవడం చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అవుతుందని అన్నారు.కోట్లాది పేద చేనేత కార్మికుల జీవితాల కోసం,  చేనేత ముడి సరకులపై ,చేనేత వస్త్రాలపై జిఎస్టి ని వెంటనే రద్దు చేయాలని ప్రధానమంత్రికి లెటర్ ల ద్వారా విజ్ఞప్తి చేశారు. చేనేత సంబంధిత వస్తువులపై గల జిఎస్టి ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు.చేనేత ఉత్పత్తులపై  జిఎస్టి  5 శాతం కాదు, 12 శాతం కాదు, 0 శాతం ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గోపాల్ నగర్ పద్మశాలి సంఘం నాయకులు గుండా కేశవులు, గణపురం నగేష్,మంగళపల్లి కృష్ణమూర్తి,బొమ్మ నర్సిములు,గొల్లపల్లి బిక్షపత ,గుర్రపు రవి,మామిడాల పాండు,మళ్ళిపెద్ది శుభాష్,మంగళపల్లి. నాగరాజు,వల్లల శ్రీను, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.