ప్రభుత్వం తక్షణ సహాయం అందజేయడం సంతోషకరం...

Submitted by bathula radhakrishna on Fri, 24/03/2023 - 15:56
Yellandu 264

అకాల వర్గానికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల తక్షణ సహాయం అందజేయడం సంతోషకరమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి,పరుచూరి వెంకటేశ్వర్లు,అధికార ప్రతినిధి పివి కృష్ణారావు లు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల పంటలు  నష్టపోయిన ఉమ్మడి ఖమ్మం,వరంగల్,కరీంనగర్ జిల్లాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడి అన్ని విధాలుగా అడుకుంటామని భరోసా ఇవ్వడం జరిగిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2.28 లక్షలకు పైగా ఎకరాలకు రూ.228 కోట్లను తక్షణ పరిహారం కింద అందజేయనున్నట్లు తెలిపారు.రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వ సహాయం కొరకుండానే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని స్పష్టం చేశారు.పట్టాదారు రైతులతో పాటు కౌలు రైతులకు సైతం నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఆప్ కీ బాత్ కిసాన్ కీ సర్కార్ అనేది బీఆర్ఎస్ నినాదమన్నారు.అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో అకాల వర్షానికి పంటలు నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా పంట నష్టం జరిగిన వివరాలను సంబందిత అధికారులతో వివరాలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా రైతు బంధు,రైతు భీమా పథకాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపి  బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తే దేశవ్యాప్తంగా రైతులకు అండగా ఉంటుందని తెలిపారు.దేశ ప్రజలు మోది ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి,నాయకులు పెండ్యాల హరికృష్ణ,మురళీకృష్ణ,కుంట నవాబ్,పాషా,గిన్నారపు రాజేష్,పాలడుగు రాజశేఖర్,సన రాజేష్,ఎస్.హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.