మూడు జిల్లాల డాన్స్ పోటీలో బ్లూమూన్స్ ప్రధమ స్థానం

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 18:11
Yellandu

ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో జానకిరామ్ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు కాస్నా నాయక్ ఆధ్వర్యంలో మూడు జిల్లాల డాన్స్ పోటీలలో పట్టణానికి చెందిన బ్లూ మూన్ డ్యాన్స్ స్టూడియో ప్రధమ స్థానంలో నిలిచిందని గురువారం బ్లూ మూన్ డ్యాన్స్ స్టూడియో నిర్వాహకులు శ్యామ్ పోదిల తెలిపారు. బహుమతిని జానకిరామ్ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా కాస్నా నాయక్,గార్ల యస్ఐ,బంజారా యువ నాయకులు జవహర్,కమిటీ సభ్యుల చేతుల మీదుగా అందుకున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా బ్లూ మూన్ డ్యాన్స్ స్టూడియో నిర్వాహకులు శ్యామ్ పోదిల మాట్లాడుతూ కాస్నా నాయక్ ప్రతి సంవత్సరం ఇలా కళాకారులకు పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం సంతోషకరమన్నారు.మా బ్లూ మూన్స్ డాన్స్ స్టూడియో పిల్లలు ఇల్లందులో నిర్వహించిన వినాయకచవితి,బతుకమ్మ, దసరా,మర్రిగూడెంలో నిర్వహించిన పోటీలలో పాల్గొని వారిలోని ప్రతిభను కనబరిచారని తెలిపారు.

Tags