Yellandu

చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్.... 310 గ్రాముల బంగారం,70 గ్రాముల వెండి,పంచలోహ విగ్రహం,రూ 95 వేల నగదు స్వాధీనం..

Submitted by bathula radhakrishna on Mon, 21/11/2022 - 17:00

ఇల్లందులో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ గుగులోత్ రంజిత్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 310 గ్రాముల బంగారం,70 గ్రాముల వెండి,పంచలోహ విగ్రహం,రూ 95 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  డా.వినిత్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.  ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు చేస్తున్న గుగులోత్ రంజిత్ ను ఈనెల 20న ఇల్లందు సిఐ బాణోత్ రాజు, సిబ్బంది నిఘా పెట్టి పట్టుకున్నారన్నారు.

Tags

కార్తీకమాస వనసమారాధనకు అధిక సంఖ్యలో తరలిరావాలి

Submitted by bathula radhakrishna on Fri, 04/11/2022 - 21:04

ఈనెల 13న మున్నూరు కాపు కులస్తుల కార్తీకమాస వనసమారాధనకు మున్నూరు కాపులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మున్నూరు కాపు పెద్దలు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.ఖమ్మం రోడ్డులోని యకూబ్ సెట్ దర్గాకు ఎదురుగా గల మామిడి తోటలో కార్తీకమాస వనసమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు.కార్తీకమాస వనసమారాధన విజయవంతానికి ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ,సహకారాలను అందించాలని కోరారు. సంఖ్యా పరంగా అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు కార్తీకమాస వనసమారాధన ద్వారా  మన ఐక్యతను చాటాలని  కోరారు.

Tags

కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలి:రంగనాథ్

Submitted by bathula radhakrishna on Sun, 30/10/2022 - 15:01

జేకే ఓసి పొడగింపు ప్రాజెక్ట్ ను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ నేడు ఇల్లందులో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎస్.రంగనాధ్ పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జేకే ఓసి పొడగింపు ప్రాజెక్ట్ ను పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలని కోరారు.గత సంవత్సరం ఇల్లందు జేకే ఓసి కోల్ తో పాటు ఓబీని సింగరేణి కార్మికులు తీయడం ద్వారా సుమారుగా రూ.400 కోట్ల లాభాలు గడించడం జరిగిందని గుర్తు చేశారు.కార్మికులకు అవకాశం ఇస్తే తప్పకుండా జేకే ఓసి పొడగింపు ప్రాజెక్ట్ కూడా లాభాలలో నడిపిస్తారని తెలిపారు.

Tags

తప్పుడు మార్గంలో వెళ్తున్న బొగ్గు లారీ సీజ్

Submitted by bathula radhakrishna on Sun, 30/10/2022 - 14:49

తప్పుడు మార్గంలో వెళ్తున్న బొగ్గు లారీని సీజ్ చేసినట్లు సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి తెలిపారు.ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మణుగూరు నుంచి కొత్తగూడెం,ఖమ్మం,సూర్యాపేట నుంచి లింగోజిగూడెం వెళ్ళవలసిన బొగ్గు లారీ ఇల్లందు మీదుగా వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది ఆపిన వేగంగా వెళ్లడం జరిగిందన్నారు. వెంటనే ప్రత్యేక టీమ్ ఆ బొగ్గు లారీని వెంబడించగా ముకుందాపురం వద్ద డ్రైవర్ లారీని వదిలి వెళ్లినట్లు తెలిపారు.

Tags

ఇల్లందు లో సంతుర్ సోప్ రీలాంచ్ వేడుకలు

Submitted by bathula radhakrishna on Sun, 23/10/2022 - 09:27

పట్టణంలోని సంతూర్ సోప్ డిస్ట్రిబ్యూటర్
యెలుగూరి నగేష్ కుమార్,విప్రో కంపెనీ జిల్లా సేల్స్ ఆఫీసర్  రామారావు ల ఆధ్వర్యంలో ఆదివారం సంతుర్ సోప్ రిలాంచ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమంలో సేల్స్ పర్సన్ రామాంజనేయులు,బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags

శివాలయంలో చోరీ... రూ.70 వేల నగదు అపహరణ ....

Submitted by bathula radhakrishna on Sun, 16/10/2022 - 08:58

ఇల్లందు ప్రధాన రోడ్డు వెంబడి ఉన్న శివాలయంలో దొంగలు పడిన ఘటన ఆదివారం  తెల్లవారుజామున జరిగింది.ఆలయ పూజారులు తెలిపిన వివరాల ప్రకారం  శివాలయం మరమ్మత్తుల పనుల నిమిత్తం ఆలయంలోని బీరువాలో ఉంచిన రూ.70 వేల నగదు దొంగిలించినట్లు తెలిపారు.అంతేకాకుండా ఆలయంలో శివుడు, అమ్మ వారు,వెంకటేశ్వర స్వామి గుడిల తాళాలను సైతం పగలకొట్టారని పేర్కొన్నారు.3 హుండీలను ధ్వంసం చేసి కొంత చిల్లరను అపహరించినట్లు తెలిపారు. చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇల్లందు సిఐ బాణోత్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించారు.

Tags

పోడు భూముల సమస్య పై మార్గదర్శకాలు విడుదల:ఎమ్మెల్యే

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 18:21

ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పేర్కొన్నారు.గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.పోడు భూముల సమస్యను అధికారులు,ప్రజలు పరస్పరం సహకరించుకోని సమస్యను శాశ్వత పరిష్కారం చేసుకోవాలని సూచించారు.పోడు భూములకు సంబంధించి సర్వే కోసం ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.ప్రజలు తమ భూములను సర్వే  చేయించుకోవాలన్నారు.ఈ అవకాశాన్ని ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని పోడు భూముల సమస్య ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోని అధికారులకు సహకరించి పోడు భూముల సమస్యను

Tags