స్మశాన వాటిక ఏర్పాటు చేస్తారా

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 15:36
Will a cemetery be established?

అనుముల సెప్టెంబర్ 02( ప్రజా జ్యోతి ) అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు ఇబ్రహీంపేట గ్రామపంచాయతీలో స్మశాన వాటిక లేదు హాలియా మున్సిపాలిటీలో  ఇబ్రహీంపేట గ్రామ విలీనం చేసిన తర్వాత 3500 నుంచి4000 దాదాపు ప్రజలు నివసిస్తున్నారు అయినను స్మశాన వాటిక ఏర్పాటు చేయకపోవడం వలన కాలువ కట్ట మరియు సొంత భూములు ఆవాసాలుగా అయినవి.

 హాలియా మున్సిపాలిటీ ఏర్పాటై 4 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వ భూములు వందల ఎకరాలు  భూములను ఆక్రమించుకున్న కలెక్టర్ , ఆర్ డి ఓ , ఎమ్మార్వో కి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన స్మశాన వాటిక ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

 హాలియా మున్సిపాలిటీ లో ఇబ్రహీంపేట గ్రామ పంచాయతీ విలీనం చేయడం దురదృష్టకరమా.50 సంవత్సరాలు అయినా ఇబ్రహీంపేట గ్రామపంచాయతీలో స్మశాన వాటిక లేదు హాలియామున్సిపాలిటీలో కలిపిన తర్వాత కూడా స్మశాన వాటిక ఏర్పాటు చేయకపోవడం ఇబ్రహీంపేట గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున అధికారులు పునర్ పరిశీలించి ఇబ్రహీంపేట గ్రామ మనకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని అలాగే క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ఇబ్రహీంపేట గ్రామ ప్రజలము కోరుకుంటున్నాము.