పోడు భూములకు త్వరలోనే పట్టాలి ఇస్తాం

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:50
 We will give pattali to waste lands soon

విపక్షాల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు 

అభివృద్ధిని చూపించే ఓటు అడుగుతాం 

ఎమ్మెల్యే శంకర్ నాయక్ 

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి): పోడు భూములకు త్వరలోనే పట్టాలు ఇస్తామని, విపక్షాల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే  శుక్రవారం మండలంలో ని బొద్దుగొండ దామరవంచ చక్ర తండా లైన్ తండా సీతానగరం చిన్నిల్లాపూర్ వెంగంపేట కోబాల్ తండా భూపతి పేట గ్రామాలలోని ప్రజలకు ఆసరా పెన్షన్ కార్డులను గూడూరు మండల కేంద్రంలోని చంద్రుణ్ చెరువు లో చాప పిల్లలను పోశారు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో బతకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్లతో కలిపి 46 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని అన్నారు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ఫైలేరియా డయాల సిస్ హెచ్ఐవి రోగులు బీడీ కార్మికులు నేత గీత కార్మికులకు ప్రభుత్వం ప్రతినెల ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు దివ్యాంగులకు 3వేల16 వృద్ధులు వితంతువులు ఇతర కేటగిరీల వారికి నెలకు 2016 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు పేదప్ప పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కిందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ సర్కార్ ఆసరాగా నిలుస్తుందని ఆయన అన్నారు 77 ఏళ్లు నిండిన వృద్ధులకు ఆసరా పింఛన్ పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత కెసిఆర్ ది అన్నారు పెన్షన్ రాను వారు మళ్లీ అప్లికేషన్ చేసుకోవాలని తెలిపారు .

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం అర్షనీయమని గిరిజనులు కేసీఆర్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఆయన అన్నారు పోడు భూములకు త్వరలో పట్టాలు ఇస్తామని ఎవరు భయపడవలసిన అవసరం లేదని ఇతర పార్టీల వాళ్లు లేనిపోని కళ్లకబోధలు మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని వారి మాటలను ఎవరు నమ్మకూడదని ఆయన అన్నారు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అడుగడుగునా జనం నీరాజనం పలికి పూల వర్షం కురిపించి మంగళ హారతులతో నుదుట తిలకం దిద్దుతూ గజమాలతో ప్రజలు నీరాజనం పల్లికిఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి ఎంపీపీ బానోత్ సుజాత మోతిలాల్ నాయక్ జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి కాసిం సొసైటీ చైర్మన్ చల్లలింగారెడ్డి వైస్ ఎంపీపీ అరేవీరన్న టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వేమ్ వెంకటకృష్ణారెడ్డి నూకల సురేందర్ కోఆప్షన్ సభ్యులు ఎండి రహీం మంగ బాలాజీ నాయలక్ష్మణరావు జలగం సంపత్ రావు తాసిల్దార్ అశోక్ కుమార్ ఎంపీడీవో విజయలక్ష్మి బోడ ఎల్లయ్య కటార్ సింగ్ భూక్య సురేష్ కాల్ సాని వేణుమాధవ్ రామన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.