ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను తక్షణమే ఇవ్వాలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు: సింగారపు రమేష్

Submitted by lenin guduru on Fri, 21/10/2022 - 19:25
Ramesh

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను తక్షణమే ఇవ్వాలి

బిల్లులు ఇవ్వకుండా  ఆలస్యం చేస్తున్న ఉపాధి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు: సింగారపు రమేష్

 దేవరుప్పుల, అక్టోబర్ 21, (ప్రజాజ్యోతి):
మండల కేంద్రంలో శుక్రవారం రెడ్డి రాజుల నారాయణ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనగామ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సింగారపు రమేష్ హాజరై మాట్లాడుతూ
గత మూడు నెలలుగా చేసిన ఉపాధిహామీ పనుల బిల్లులను ఇంత వరకు చెల్లించకపోవడం సరి కాదు అని మండిపడ్డారు.  తక్షణమే పెండింగ్ లో ఉన్న బిల్లులను రిలీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో జిల్లా అధికారులు, సిబ్బంది అలసత్వం వహించడం వల్ల కూలీలు అవస్థల పాలవుతున్నారని, మన రాష్ట్రంలో నిర్ణయించిన కూలీరేట్లు తక్కువగా ఉండటం వల్ల చేసిన పనికి ఎక్కడ రూపాయలు మించకుండా దినకూలి వస్తున్నదని, ఇది చట్ట విరుద్ధమని,
కేరళ రాష్ట్రంలో ఇచ్చినట్టుగా దిన కూలి ఆరువందలుగా నిర్ణయించి, పనిచేసే చోట సౌకర్యాలు కల్పించి, పనిచేయడానికి పనిముట్లను ఇచ్చి కూలీలను ఆదుకోవాలని, గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేట్లకు గౌరవ వేతనం, సెల్ ఫోను, సైకిల్ వంటివి సమకూరుస్తానని చెప్పిందని
ఇప్పటివరకు వాటి ఉసెత్తడం లేదని, గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు జరపాలని,
పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే చెల్లించాలని, సీనియర్ మెట్లలో అర్హత ఉన్న వాళ్లను సిబ్బందిగా గుర్తించాలని, మేట్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు  జరపాలని, మహాసభ తీర్మానం చేసారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోతుకనూరి ఉపేందర్, పాలడుగుల ప్రశాంత్, నల్ల ప్రవీణ్, బత్తుల సత్తయ్య, దుర్గాప్రసాద్, కోట అమరేందర్, ఉపేందర్, చింత ప్రవీణ్, యాకయ్య, మాతంగి చంద్రయ్య, నల్ల మనోజ్ కుమార్, బానోతు మంగ్య, నాయకపు శ్రీను, వివిధ గ్రామాల సంఘ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.