ధళితుల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది తుంగపహాడ్ సర్పంచ్ దండిగా అలివేలు నరసింహ

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:53
TRS government will work for the development of Dalits   Tungapahad Sarpanch Dandiga Alivelu Narasimha

నాంపల్లి, సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి ):   దళితుల అభివృద్ధికి  ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని స్థానిక గ్రామ సర్పంచ్ దండిగ అలివేలు నర్సింహా అన్నారు‌.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి మండలం తుంగపాడ్ గ్రామంలో ధళిత వాడల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం  జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ,  పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనానికి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  పేరును నామకరణం చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడారని ఆయన అన్నారు.రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి,సంక్షేమ పథకాలను  ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు.కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని....కేవలం టీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు .

ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం,కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  బతుకమ్మ కానుకగా  మహిళలకు చీరల పంపిణీ  చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కడారి శ్రీశైలం,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పుల్కరం వెంకటయ్య,ఉప సర్పంచ్ పచ్చిపాల జంగమ్మ ఆంజనేయులు,కొమ్ము నర్సింహా,మేకల దేవేందర్,నేతాల్ల నర్సింహా,దండిగ చంద్రయ్య, దండిగ ఈదయ్య,దండిగ నరేందర్ యాదవ్, కొమ్ము నర్సింహా,నేతళ్ళ నరేష్, కొమ్ము వెంకటయ్య, జిల్లా రాములు, కొమ్ము రాములు, కొమ్ము రామచంద్రం,బట్టు వెంకట్రాములు,బట్టు బిక్షం, బట్టు ఈదయ్య, జిల్లా వెంకటయ్య  తదితరులు పాల్గొన్నారు.