ఎల్లెందు

సద్దుల బతుకమ్మ ఆట,పాటలతో సందడి

Submitted by bathula radhakrishna on Mon, 03/10/2022 - 21:50

సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని సోమవారం ఆమ్ బజార్ పాత శుభోదయ స్కూల్ వద్ద మహిళలు, యువతులు,చిన్నారులు ఆట,పాటలతో సందడి చేశారు.వియం మిర్యాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మిర్యాల చంద్ర మోహన్,మార్గదర్శిని విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా బతుకమ్మలను అందంగా పేర్చిన వారికి బహుమతులను అందజేశారు.

 

Tags

ఇల్లందులో సందడిగా సద్దుల బతుకమ్మ

Submitted by bathula radhakrishna on Mon, 03/10/2022 - 20:07

 ఇల్లందు మున్సిపల్ పరిధిలోని 6,7 వార్డులు నెంబర్ 2 బస్తీలో సోమవారం సద్దుల బతుకమ్మలో సందడి చేశారు. ఉదయం నుంచి బతుకమ్మలను ఎంతో అందంగా పోటాపోటీగా పేర్చి సాయంత్రం ఓ ప్రదేశంలో మహిళలు,యువతులు,చిన్నారులు కలిసి బతుకమ్మ పాటలతో సంబురాలు చేశారు. 

Tags

మణిక్యారంలో హుషారుగా సద్దుల బతుకమ్మ

Submitted by bathula radhakrishna on Mon, 03/10/2022 - 20:05

 మండల పరిధిలోని మణిక్యారం పంచాయతీలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలను చిన్న,పెద్ద అనే తేడా లేకుండా హుషారుగా ఆడి,పాడారు.మణిక్యారం పంచాయతీ సర్పంచ్ మోకాళ్ళ కృష్ణ,చెన్నూరి కృష్ణ,బాణోత్ రాంబాబు,సిహెచ్ శ్రీను,పుప్పాల ఉపేందర్ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా బతుకమ్మ వేడుకలను కోమరారం ఎస్ఐ ప్రారంభించారు.

Tags

మాట ప్రకారం గిరిజన రిజర్వేషన్ పెంపు:ఎమ్మెల్యే

Submitted by bathula radhakrishna on Sat, 01/10/2022 - 19:01

గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకోవడం జరిగిందని ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ నాయక్ స్పష్టం చేశారు.శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన రిజర్వేషన్ పెంచడాన్ని హర్షిస్తూ సియం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Tags

మాట ప్రకారం గిరిజన రిజర్వేషన్ పెంపు:ఎమ్మెల్యే

Submitted by bathula radhakrishna on Sat, 01/10/2022 - 18:42

 గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకోవడం జరిగిందని ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ నాయక్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన రిజర్వేషన్ పెంచడాన్ని హర్షిస్తూ సియం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన పక్షపాతి అన్నారు.సబ్బండ వర్ణాల అభివృద్దే కేసీఆర్  లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  షెడ్యూల్ తెగల రిజర్వేషన్ ను ఆరు నుండి 10కి పెంచుతూ జీఓ 33 ను జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags

కార్మికుల కొరకు ఎన్నో అగ్రిమెంట్ లు చేసిన చరిత్ర ఏఐటీయూసీది:సారయ్య

Submitted by bathula radhakrishna on Sat, 01/10/2022 - 17:59

సింగరేణి కార్మికులకు కొరకు ఎన్నో అగ్రిమెంట్ లు చేసిన చరిత్ర ఏఐటీయూసీదని సింగరేణి కాలరీస్ వర్కర్స్  యూనియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య పేర్కొన్నారు. శనివారం జేకే ఓసీలో జరిగిన పిట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థకు లాభాల వాటకు బాట వేసింది కెఎల్ మహేంద్ర అన్నారు.

Tags

సియం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

Submitted by bathula radhakrishna on Sat, 01/10/2022 - 17:39

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచడాన్ని హర్షిస్తూ జడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సియం కేసీఆర్ చిత్ర పటానికి శనివారం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పాలాభిషేకం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గిరిజన రిజర్వేషన్ పెంచడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు పాయం లలిత,పాయం స్వాతి, చీమల వెంకటేశ్వర్లు,కల్తి పద్మ,వెంకట నరసయ్య, చీమల వీరభద్రం,పూనెం కవిత,మంకిడి కృష్ణ, రామయ్య, తాటి మౌనిక, చాట్ల భాగ్యమ్మ, నునావత్ తిరుపతి,తాటి చుక్కమ్మ,ఎంపీటీసీలు మండల రాము,పూనెం సురేందర్,పాయం కృష్ణ ప్రసాద్, తాటి యశోద,ఉప సర్పంచ్ లు తాటి రాంబాబు, ఎల్లయ్య,నాయకులు సువర్ణపాక సత్యనా

Tags

బతుకమ్మ వేడుకల నిర్వహణ

Submitted by bathula radhakrishna on Sat, 01/10/2022 - 17:07

సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో దసరా పండుగను పురస్కరించుకుని శనివారం జియం కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.ఏరియా జియం షాలెము రాజు ఆధ్వర్యంలో కార్యాలయ మహిళ ఉద్యోగులు బతుకమ్మ ఆట,పాటలతో సందడి చేశారు.ఈ సందర్బంగా ఏరియా జియం సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జియం బండివెంకటయ్య,ఏజిఎం(ఐఇడి) యం.గిరిధరరావు,డిజియం (పర్సనల్) జివి మోహన్ రావు,ఏరియా సర్వే అధికారి బాలాజీ నాయుడు,అధికారుల సంఘ కోశాధికారి పసుల రమేష్, గుర్తింపు సంఘ ఉపాధ్యక్షులు సుదర్శనం.రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

డిగ్రీ కళాశాల విద్యార్థిని జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం

Submitted by bathula radhakrishna on Sat, 01/10/2022 - 16:57

తెలంగాణ రాష్ట్ర కమిషనర్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఈపిటిఆర్ఐ,రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ కొమురం శిరీష ప్రధమ స్థానంలో నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పొలారపు పద్మ తెలిపారు.శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఓజోన్ పరిరక్షణ-విద్యార్థుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలవడం సంతోషకరమన్నారు.

Tags

కోటమైసమ్మ జాతరకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలి

Submitted by bathula radhakrishna on Sat, 01/10/2022 - 14:38

మండల పరిధిలోని నిజాం పేట,రేపల్లె వాడ గ్రామాల సమీపంలోని సుమారుగా 70సంవత్సరాల చరిత్ర కలిగిన కోటమైసమ్మ జాతరకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సర్పంచ్ అలెం కౌసల్య, ఆలయ చైర్మన్ సూర్నపాక శోభన్ బాబు లు కోరారు.శనివారం స్థానిక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈనెల 4న నిజాంపేట,రేపల్లెవాడ, ముకుందా పురం గ్రామాల నుంచి భారీ ఎత్తున కోతమైసమ్మ కు బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు.ఈనెల 5 నుంచి 7 వరకు జాతర ఉంటుందని పేర్కొన్నారు.

Tags