ఎల్లెందు

జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు

Submitted by bathula radhakrishna on Mon, 10/10/2022 - 16:29

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడవ ర్యాంకు సాధించినందుకు గాను సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మున్సిపల్ చైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు,కమిషనర్ అంకుషావలి లు కలిసిన పుష్ప గుచ్యం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈఅవార్డును దేశ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.

Tags

ఘనంగా సుద్దాల హనుమంతు 40వ వర్థంతి

Submitted by bathula radhakrishna on Mon, 10/10/2022 - 16:10

బాంచేన్ కాలు మొక్కుతా అన్న వారితో బంధుకులు పట్టించిన పాటలకు ప్రాణం పొసిన సుద్దాల హనుమంతు 40వ వర్థంతిని సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ తన్జీమ్-ఎ-ఇన్సాఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక పార్టీ కార్యాలయంలో సుద్దాల హనుమంతు చిత్ర పటానికి తన్జీమ్-ఎ-ఇన్సాఫ్ జిల్లా అద్యక్షులు యండి నజీర్ అహ్మద్ పూల మెల వేసి నివాళులర్పించారు.

Tags

ఎన్నికల్లో లబ్దిపొందేందుకే పొడుభూముల జీఓ

Submitted by bathula radhakrishna on Mon, 10/10/2022 - 15:37

మునుగోడు ఉప ఎన్నికల్లో అక్కడి గిరిజనుల ఓటు బ్యాంక్ ద్వారా లబ్దిపొందేందుకే ప్రభుత్వం పోడుభూముల జీఓ తీసుకురావడం జరిగిందని కాంగ్రెస్ జిల్లా నాయకులు లక్కినేని సురేందర్,భూక్యా దళ్ సింగ్ నాయక్,ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు డా.

Tags

ఘనంగా రాజ్ బహదూర్ గౌర్ 11 వ వర్థంతి

Submitted by bathula radhakrishna on Sat, 08/10/2022 - 18:03

కార్మిక వర్గ పోరాటాల నిర్మాత,పలు కార్మిక సంఘాల వ్యవస్థాపకులు రాజ్ బహదూర్ గౌర్ 11 వ వర్థంతిని శనివారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆద్వర్యంలో స్థానిక విఠల్ రావు భవన్ నందు ఘనంగా నిర్వహించారు.సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.సారయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్ బహదూర్ గౌర్ ఎఐటియుసి అనుబంధంగా అనేక కార్మిక సంఘాలు స్థాపించిన ఘనుడని కొనియాడారు.కార్మిక పోరాటాలకు న్యాయకత్వం వహించి అనేక నిర్బంధాలను అదిగమించి కార్మిక హక్కులు సాదించిన మహనీయుడు గౌర్ అని స్పష్టం చేశారు.నాడు నిజాం నిరంకుశ పాలనకు దొరలు దేశ్ ముక్ లకు

Tags

ట్రిపుల్ రైడింగ్ వానాదారులకు జరిమానా:డిఎస్పీ

Submitted by bathula radhakrishna on Fri, 07/10/2022 - 17:47

ట్రిపుల్ రైడింగ్ వానాదారులకు భారీ జరిమానా విధించడం జరుగుతుందని ఇల్లందు డిఎస్పీ రమణా మూర్తి స్పష్టం చేశారు.శుక్రవారం పట్టణంలో 16 ట్రిపుల్ రైడింగ్ దారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వాహనాలపై పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకొని యెడల తమ వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.ఆటోలలో డ్రైవర్స్ పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు డేక్కులు పెట్టుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని ఎవరైనా పెద్ద శబ్దాలతో వాహనాలను నడిపినట్లైతే ఆటోలను సైతం సీజ్ చేయబడుతుందని తెలిపారు.ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని

Tags

ఇల్లందులో పర్యటించిన జడ్పీ ఛైర్మన్

Submitted by bathula radhakrishna on Fri, 07/10/2022 - 16:49

ఇల్లందులో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య శుక్రవారం పర్యటించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వస్త్ర బాలకృష్ణ ఖండేల్ వాల్ సోదరి విమలాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.మండల పరిధిలోని చల్ల సముద్రం గ్రామ పంచాయతీకి చెందిన సోల్తి ఐలయ్య గౌడ్ కుమార్తె భార్గవ శ్రీ ఓనీల వేడుకకు హాజరై ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ తాటి చుక్కమ్మ,ఉప సర్పంచ్ కుర్ర అరుణ, ఎంపీటీసీ మండల రాము,నాయకులు మడుగు సాంబమూర్తి,చిల్లా శ్రీనివాస్,కాకటి భార్గవ్,రమేష్ చంద్రగుప్త,శివకుమార్ ఖండేల్ వాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags

ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెల్యే

Submitted by bathula radhakrishna on Wed, 05/10/2022 - 07:34

ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ విజయదశమి రోజు బుధవారం తెల్లవారుజామున 5:40 గంటలకు ఆడబిడ్డకు జన్మనిచ్చారు.పట్టణంలోని రావూస్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో డా.కల్పన ఆపరేషన్ చేశారు.

Tags

కన్నుల పండుగగా సద్దుల బతుకమ్మ

Submitted by bathula radhakrishna on Tue, 04/10/2022 - 15:56

 మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు పటేల్ చౌక్ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రుల మండపం వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.మహిళలు,యువతులు,చిన్నారులు ఎంతో ఆనందంగా బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలకు ఆర్యవైశ్య సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెర్ల చంద్రశేఖర్ బహుమతులను అందజేశారు.ఈకార్యక్రమంలో నిర్వాహకులు,మహిళలు పాల్గొన్నారు

Tags

రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు

Submitted by bathula radhakrishna on Tue, 04/10/2022 - 09:44

రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులకు తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం ఇల్లందులో జరిగింది. ఇల్లందు పట్టణానికి చెందిన ఇరువురు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఒక్కసారిగా ట్రాలీ రావడంతో బండి అదుపుతప్పి క్రింద పడ్డారు.దింతో ఇరువురు యువకులకు కాళ్ళు విరిగినట్లు తెలిసింది. కాగా యువకుల కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

Tags