ఎన్నికల్లో లబ్దిపొందేందుకే పొడుభూముల జీఓ

Submitted by bathula radhakrishna on Mon, 10/10/2022 - 15:37
Yellandu muncipality

మునుగోడు ఉప ఎన్నికల్లో అక్కడి గిరిజనుల ఓటు బ్యాంక్ ద్వారా లబ్దిపొందేందుకే ప్రభుత్వం పోడుభూముల జీఓ తీసుకురావడం జరిగిందని కాంగ్రెస్ జిల్లా నాయకులు లక్కినేని సురేందర్,భూక్యా దళ్ సింగ్ నాయక్,ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు డా. శంకర్ నాయక్ లు ఆరోపించారు.సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లలో సుమారుగా లక్షల ఎకరాల భూములను లాక్కొవడం జరిగిందని విమర్శించారు.వెంటనే ఆ భూములకు పట్టాలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.2018 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలో కూర్చొని పొడు భూముల సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికలు అయ్యాక వారిని మోసం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటిగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెబుతుంటే వరంగల్ లో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ చిప్ విప్ లు సమావేశం ఏర్పాటు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వమని తాత్కాలికంగా సేద్యం చేసుకొని ఫలసాయం మాత్రమే తినాలని పేర్కొవడం ఏమిటని ప్రశ్నించారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, హామీలను తప్పనిసరిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఎస్టీ రిజర్వేషన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి సంతోషమని,కానీ చట్టాలలో లోపాలు లేకుండా చూడాలని కోరారు.సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లందు మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు.ఇల్లందు ఏరియాలోని కేఓసి పిట్ 3 ను 6నెలల క్రితం, ఇల్లందు జేకే ఓసి ని ప్రస్తుతం ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదన్నారు.ప్రైవేటీకరణ వల్ల ఇక్కడి కార్మికులను మీరు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయడం జరుగుతుందని బోర్డు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.సింగరేణి సంస్థను కనుమరుగు చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని వాటిని ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఆధాని,అంబానీ ల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని,అవసరమైతే పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. ఈసమావేశంలో పట్టణ,మండల అధ్యక్షులు దొడ్డ డానియల్,పులి సైదులు,నాయకులు మహబూబ్,జాఫర్,సుదర్శన్ కోరి,ఈర్యా నాయక్, అన్వర్,యండి ఇబ్రహీమ్,వెంకట నారాయణ, వర్మ,గోడుగు వేణు,లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags