ట్రిపుల్ రైడింగ్ వానాదారులకు జరిమానా:డిఎస్పీ

Submitted by bathula radhakrishna on Fri, 07/10/2022 - 17:47
Yellandu

ట్రిపుల్ రైడింగ్ వానాదారులకు భారీ జరిమానా విధించడం జరుగుతుందని ఇల్లందు డిఎస్పీ రమణా మూర్తి స్పష్టం చేశారు.శుక్రవారం పట్టణంలో 16 ట్రిపుల్ రైడింగ్ దారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వాహనాలపై పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకొని యెడల తమ వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.ఆటోలలో డ్రైవర్స్ పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు డేక్కులు పెట్టుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని ఎవరైనా పెద్ద శబ్దాలతో వాహనాలను నడిపినట్లైతే ఆటోలను సైతం సీజ్ చేయబడుతుందని తెలిపారు.ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని తెలిపారు. ప్రతి డ్రైవర్ కు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలన్నారు. ఇస్తానుసారంగా వాహనాలను నడిపిన,నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయబడుతుందని హెచ్చరించారు.పట్టణంలో ఎవరైనా మోటార్ సైకిల్ సైలెన్సర్లను తీసేసి అధిక శబ్దాలు చేసే వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకొని అట్టి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు.ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఈకార్యక్రమంలో ఇల్లందు సీఐ బాణోత్ రాజు,సిబ్బంది పాల్గొన్నారు.

Tags