గిరిజన పక్షపాతి సియం కేసీఆర్:భూక్య సంజీవ్ నాయక్

Submitted by bathula radhakrishna on Tue, 04/10/2022 - 18:02
Yellandu

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన పక్షపాతి అని సేవాలాల్ సేన వ్యస్థాపక అధ్యక్షులు,గిరిజన  రిజర్వేషన్ పోరాటసమితి కన్వీనర్ భూక్య సంజీవ్ నాయక్ స్పష్టం చేశారు.మంగళవారం గిరిజన రిజర్వేషన్ పెంచడాన్ని హర్షిస్తూ   కెసిఆర్ కు కృతజ్ఞత ర్యాలీ అటవీ శాఖ కార్యాలయం వద్ద నుంచి పట్టణంలో  నిర్వహించారు.ఈసందర్భంగా సంజీవ్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచి దశాబ్దాల కాలంగా ఉద్యమం ద్వారా సాధించిన విజయానికి గుర్తుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడం,తండా, గూడెంలను పంచాయతీ గా ఏర్పాటు చేసుకోవటం,10శాతం గిరిజన రిజర్వేషన్ పెంచటం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో కెసిఆర్ చొరవతో సాధ్యమైందని తెలిపారు.పోడు సమస్య పరిష్కారం కోసం జీవో ఇవ్వటంతో గిరిజన సంఘాల ఐక్య వేదిక, సేవాలాల్ సేన ఆహ్వానం మేరకు పాల్గొనటం సంతోషంగా ఉందని  పేర్కొన్నారు.అనంతరం సేవాలాల్ సేన రైతు  సంఘ అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ 10శాతం  రిజర్వేషన్ పోరాటాల  ద్వారా సాధించిన  సేవాలాల్ సేన  వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య  సంజీవ్ నాయక్ ను ఇల్లందు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న నాయకుడికి సన్మానం చేయటం అదృష్టమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయక్ ప్రేమ్ చంద్ నాయక్, ఇస్లావత్ సతీష్,ఇస్లావత్ రాందాస్,మాలోత్ శివ, మల్లికార్జున్ యాదవ్, యాకుబ్,గంగవత్ కిషన్, సపవత్ నందులాల్, అనిల్ రెడ్డి,భూక్య గోవింద్ నాయక్,బాలకృష్ణ, భాస్కర్,సురేష్,హత్కర్ వెంకటేష్,రాజేష్, రాంబాబు,అనిల్,రమేష్, చందర్,అశోక్,రమేష్ రాథోడ్ తదితరులు  పాల్గోన్నారు.

Tags