ఘనంగా రాజ్ బహదూర్ గౌర్ 11 వ వర్థంతి

Submitted by bathula radhakrishna on Sat, 08/10/2022 - 18:03
Yellandu

కార్మిక వర్గ పోరాటాల నిర్మాత,పలు కార్మిక సంఘాల వ్యవస్థాపకులు రాజ్ బహదూర్ గౌర్ 11 వ వర్థంతిని శనివారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆద్వర్యంలో స్థానిక విఠల్ రావు భవన్ నందు ఘనంగా నిర్వహించారు.సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.సారయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్ బహదూర్ గౌర్ ఎఐటియుసి అనుబంధంగా అనేక కార్మిక సంఘాలు స్థాపించిన ఘనుడని కొనియాడారు.కార్మిక పోరాటాలకు న్యాయకత్వం వహించి అనేక నిర్బంధాలను అదిగమించి కార్మిక హక్కులు సాదించిన మహనీయుడు గౌర్ అని స్పష్టం చేశారు.నాడు నిజాం నిరంకుశ పాలనకు దొరలు దేశ్ ముక్ లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగం సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలబడి పోరాటాలు చేసిన సాయుధ పోరాట యోధుడు గౌర్ అన్నారు.ఎఐఎస్ఎఫ్ కు ముందు ఈ రాష్ట్రంలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ వ్యవస్థాపకుల్లో ఒకరుగా విద్యార్థుల ఉద్యమాలకు ఊపిరిలు ఊదీన విద్యార్థి ఉద్యమ నేతగా,ప్రముఖ ఉర్దూ కవిగా పేరుగాంచిన మహనీయుడు గౌర్ అని కొనియాడారు.చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కొరకు కట్టుబడిన కమ్యూనిస్టు గౌర్ అని,వారు చూపిన బాటలో పయనిస్తూ నేడు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్,ఎఐటియుసి డివిజన్ కార్యదర్శి యండి నజీర్ అహ్మద్,ఇన్సాఫ్ పట్టణ కార్యదర్శి షంశుద్దిన్,బజారు ఆంజనేయులు,పొచయ్య,సత్యనారాయణ,వలి,రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags