ఎల్లెందు

మూడు జిల్లాల డాన్స్ పోటీలో బ్లూమూన్స్ ప్రధమ స్థానం

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 18:11

ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో జానకిరామ్ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు కాస్నా నాయక్ ఆధ్వర్యంలో మూడు జిల్లాల డాన్స్ పోటీలలో పట్టణానికి చెందిన బ్లూ మూన్ డ్యాన్స్ స్టూడియో ప్రధమ స్థానంలో నిలిచిందని గురువారం బ్లూ మూన్ డ్యాన్స్ స్టూడియో నిర్వాహకులు శ్యామ్ పోదిల తెలిపారు. బహుమతిని జానకిరామ్ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా కాస్నా నాయక్,గార్ల యస్ఐ,బంజారా యువ నాయకులు జవహర్,కమిటీ సభ్యుల చేతుల మీదుగా అందుకున్నట్లు పేర్కొన్నారు.

Tags

సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరం

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 17:57

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసిఐఎల్), అలింకో సంస్థలు,స్త్రీ,శిశు,వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆ్వర్యంలో గురువారం ఇల్లందు మార్కెట్ యార్డ్  నందు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరం నిర్వహించారు.ఈసందర్భంగా ఇల్లందు ఐసిడీఎస్ సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ బిపిల్ కు చెందిన దివ్యాంగులు,విభిన్న ప్రతిభవంతులకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉపకరణాలు,సహాయ పరికరాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

Tags

వ్యాసరచన చిత్రలేఖన విజేతలకు బహుమతులు

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 17:52

సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న అజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సింగరేణి పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో విజేతలకు గురువారం ఏరియా జియం ఎం.షాలేము రాజు బహుమతులను అందజేశారు.ఈసందర్భంగా జియం మాట్లాడుతూ సింగరేణి పాఠశాలలో స్వచ్చమైన త్రాగు నీటి వినియోగం,సంరక్షణ పద్ధతులు,స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో గాంధీజీ పాత్ర అనే అంశాలపై  విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.విద్యార్ధులు చదువుతోపాటు వ్యాసరచన, చిత్రలేఖనలో ప్రావీణ్యత సంపాదించాలని ఇలాంటి పోటీల్లో పాల్గొని తమ లోని నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏజిఎం(ఐఇడి) యం

Tags

పోడు భూములకు పట్టాలు ఇవ్వడం సంతోషకరం:దిండిగాల

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 17:44

పొడుభూములకు పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ  విడుదల విడుదల చేయడం సంతోషకరమని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పేర్కొన్నారు.

Tags

లారీ అసోసియేషన్ సమస్యలు పరిష్కరించాలి

Submitted by bathula radhakrishna on Tue, 11/10/2022 - 17:23

తెలంగాణ రాష్ట్రంలో లారీ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర లారీ అసోసియేషన్ అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమద్ది రవిలు కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.లారీ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సింగిల్ పర్మిట్,గ్రీన్ టాక్స్ తదితర ప్రధాన సమస్యలపై మంత్రితో చర్చించారు.మంత్రి సానుకూలంగా స్పందించి లారీ ఓనర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు పేర్కొన్నారు.

Tags

జెకె ఓసీలో చండీయాగం

Submitted by bathula radhakrishna on Mon, 10/10/2022 - 18:29

సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా జెకె ఓసీలో సింగరేణి కాలరీస్ సంస్థ అభివృద్ధి కొరకు సర్వయాజమాన్య సహిత కార్మిక కుటుంబాల రక్షణ కొరకు అత్యంత వైభవంగా సోమవారం   చండీయాగాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ బొల్లం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.ఈనెల 10 నుంచి 14 వరకు చండీయాగంలో భాగంగా  వివిధ రకాల పూజాలు నిర్వహించనున్నారు.ఉదయం గణపతి పూజ,స్వస్తి పుణ్యవచనం,పంచాంగ వ్యప్రాసన,రక్షాబంధనం, అఖండ దీపారాధన, వాస్తు మండపారాధన, సాయంత్రం అగ్నిప్రతిస్టాపన,లక్ష్మి గణపతి హోమం, నీరాజన మంత్రపుష్పం మొదలైన పూజలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు.ఈకార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పంజాల శ్రీనివాసు,మేనేజర్ పి.పూర్ణ చందర్,శివప్రసాద

Tags

దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ

Submitted by bathula radhakrishna on Mon, 10/10/2022 - 18:20

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఇసిఐఎల్) సంస్థ సహకారంతో ఆలింలో సంస్థ,జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఈనెల 13న బిపియల్ కు చెందిన దివ్యాంగులు,విభిన్న ప్రతిభావంతులకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉపకరణాలు,సహాయపరికరాలను స్థానిక మార్కెట్ యార్డులో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఇల్లందు ఐసిడియస్ సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు.సోమవారం విలేకరులతో మాట్లాడుతూ శిబిరానికి హాజరై పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

Tags