ఘనంగా సుద్దాల హనుమంతు 40వ వర్థంతి

Submitted by bathula radhakrishna on Mon, 10/10/2022 - 16:10
Yellandu

బాంచేన్ కాలు మొక్కుతా అన్న వారితో బంధుకులు పట్టించిన పాటలకు ప్రాణం పొసిన సుద్దాల హనుమంతు 40వ వర్థంతిని సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ తన్జీమ్-ఎ-ఇన్సాఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక పార్టీ కార్యాలయంలో సుద్దాల హనుమంతు చిత్ర పటానికి తన్జీమ్-ఎ-ఇన్సాఫ్ జిల్లా అద్యక్షులు యండి నజీర్ అహ్మద్ పూల మెల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాటల,తుటాల యోధుడు సుద్దాల హనుమంతు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో జన్మించారని తెలిపారు.హనుమంతు చిన్న నాటినుంచి 14వ ఏటా రాసిన పాటలు గడపగడపను తట్టిలేపి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచాయని పేర్కొన్నారు.1944 లో 11 వ ఆంద్ర మహసభ సమావేశాల్లో హనుమంతు వాలంటీర్ గా పాల్గొన్నారన్నారు.నాయకులు ఇచ్చిన ప్రసంగాలకు ఆకర్శితులై అతని పాటలకు పదును పెట్టారని,ఆంద్ర మహసభ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ గ్రామాన రైతు కూలీల సంఘాలు పెట్టి ప్రజలను నిజాం పాలనకు వ్యతిరేకంగా 1946-51 వరకు జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగం పొరాటాంలో కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించి భూస్వామ్యుల చెరలో ఉన్న వేట్టి చాకిరీపై పాటలు రాసి పాడి వారిలో చైతన్యం రగిలించిన యోధుడు హనుమంతు అని కొనియాడారు.రాజంపేట మండలం రేణిగుంట లొ కమ్యూనిస్టు పార్టీ గ్రామసభలో మాభూమి నాటకం ప్రదర్శన వల్ల ప్రజలను కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్శితులై విదంగా దొహదపడిందని పేర్కొన్నారు.సాయుధ పోరాటంలో వారి పాత్ర చారిత్రాత్మకమైందని,వారి చరిత్రను నేటి తరం విద్యార్థులకు తేలిసే విదంగా పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags