విద్యలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 12:40
Special attention should be given to the students who are backward in education.

జిల్లా మానిటరింగ్ అధికారి సతీష్ కుమార్.

అచ్చంపేట సెప్టెంబర్. 22. ప్రజా జ్యోతి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చదువులో వెనకబడి ఉన్న విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా మానిటరింగ్ అధికారి సతీష్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న సముదాయ సమావేశాలను గురువారం బల్మూరు మండలంలోని కొండనాగుల పలుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించి పరిశీలించారు   జిల్లా స్థాయిలో జరుగుతున్న పాఠశాల సముదాయ  సమావేశాల్లో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారుఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల సముదాయ ఆవశ్యకతను వివరించారు ఉపాధ్యాయులు బోధన అభ్యాసనకు సంబంధించి నూతన పోకడలను ఒక వేదికపై చర్చించుకోవడానికి అభ్యాసన విధానాలను సమీపించడానికి సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు వెనుకబడిన విద్యార్థులకు వివిధ పాఠశాలలో ఉపాధ్యాయులు అనుసరిస్తున్నటువంటి విధానాలను అందరూ ఉపాధ్యాయులు తెలుసుకొనుటకు ఉపయోగపడుతుందని ప్రతి పాఠశాలలోని తరగతి వారీగా విద్యార్థులు  ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాలల సముదాయం ప్రధానోపాధ్యాయులు విష్ణుమూర్తి శ్రీనివాసమూర్తి ఉపాధ్యాయులు పాల్గొన్నారుఫోటో రైట్ అప్సముదా సమావేశంలో మాట్లాడుతున్న ఏఎంఓ.