బచ్చన్నపేట రైతు వేదికలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు: జిల్లా వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:29
Seemantas for pregnant women in Bachchannapet farmer's venue: District Vice Chairman Giraboina Bhagyalakshmi

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చన్నపేటరైతు వేదికలో గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జనగామ జిల్లా వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి  అంజయ్య. స్థానిక సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి,సిడిపిఓ రమాదేవి,ఎంపీడీవో రఘు రామకృష్ణ, ఏ పీ ఎం జ్యోతి మెడికల్ ఆఫీసర్ సిద్ధార్థ రెడ్డి హాజరై  జ్యోతి ప్రజ్వలన చేసి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు,అంగన్వాడి సూపర్వైజర్ పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వారు హాజరై మాట్లాడుతూ,తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలని నిర్వహించిన పోషణ మాసం అవగాహన సదస్సుకు వారు విచ్చేసి మాట్లాడుతూ పోషణ మాస ఉత్సవాలలో భాగంగా నెల రోజులపాటు పోషకాహార విలువలపై గర్భిణీలు బాలింతలు చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గర్భిణీలు బాలింతలు ఆరేళ్లలోపు చిన్నారులకు రక్తహీనత సమస్య నుండి కాపాడేందుకు వైద్య శాఖ సమన్వయంతో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారం అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.  ప్రతి నెల మొదటి వారంలో అంగన్వాడి కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఎత్తు బరువుల కొలతలు తీసి పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.  ప్రతి ఒక్కరు విటమిన్లు మినరల్స్ అన్ని రకాల పోషకాలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా ఉపాధ్యక్షురాలు రజిత  ఏ యన్ ఎం శిరీష, ఈ ఓ అనిల్ రాజు, బచ్చన్నపేట అంగన్ వాడి టీచర్స్, గర్భిణీలు, బాలింతలు, అయాలు, తదితరులు పాల్గొన్నారు.