రైతు గోస బిజెపి భరోసా యాత్ర.

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 14:18
Rythu Gosa BJP Bharosa Yatra.

  హామీలే గాని అమలేక్కడ
  దళిత బందుకే దిక్కులేదు
  ఇంకా గిరిజన బంధువువా 
   తెలంగాణ సీఎం కేసీఆర్ కు అధికారం మీద ఉన్న  ఆసక్తి  , ప్రజా సమస్యల మీద లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర నాయకులు బాబు మోహన్.
.
E18 సెప్టెంబర్ ప్రజాజ్యోతి ; రేగొండ మండలంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి  చందుపట్ల కీర్తి రెడ్డి ఆధ్వర్యంలో  ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర ప్రారంభమైంది.భరోసా యాత్ర లో బాగంగా చెన్నపురం గ్రామం నుండి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  బీజేపీ రాష్ట్ర నాయకుడు  మాజీ మంత్రి బాబు మోహన్ హాజరయ్యారు.రేగొండ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర కొనసాగింది..కేంద్రం ఇస్తున్న నిదులను వాడుకుంటున్న  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మాత్రం తప్పుడు విషయాలను ప్రచారం చేస్తుందని విమర్శించారు.ప్రధాని మోడీ ఆదేశాలతో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి గ్రామాలలో పర్యటిస్తూ  జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో , రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అదేవిధంగా గత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ రావు గిరిజన బంధువు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే నియోజకవర్గం లో 100 మందికి ఇచ్చేటువంటి దళిత బంధువుకి దిక్కులేదు కానీ గిరిజన బంధువు ఎలా ప్రకటించారని ఎద్దేవ చేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక హామీలు అందించడం జరిగింది ఆ హామీలు ఎక్కడ  పోయాయో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఎదుర్కొంటున్నారని సూచించారు.

అదేవిధంగా పుట్టబోయే పిల్లవాడికి కూడా తలొక్కరికి 1లక్ష 30 వేల అప్పును కేటాయించినటువంటి ముఖ్యమంత్రి  గతంలో బంగారు ప్రభుత్వం తీర్చిదిద్దామన్న మాట అవాస్తమని ఇప్పుడు నిరుపేద రాష్ట్రంగా తీర్చిదిద్దే నందుకు కంకణం బద్దులుయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తక్షణమే బిజెపి అధికారంలోకి వస్తే రైతులకు ఎలాంటి గోస ఉండయని వివరించారు. అట్లాగే గోరికొత్తపల్లి గ్రామంలోవివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కీర్తి రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది.ఈ యాత్రలో జిల్లా నాయకులు, వేన్నంపల్లి పాపయ్య,  లింగంపల్లి ప్రసాద్ రావు, ఎరుకల గణపతి, సుంకరి మనోహర్, గాలిప్, గూడ రాకేష్, లక్కర్స్ నరేష్, శ్రీరామ్ సంతోష్, మండల నాయకులు, యూత్ నాయకులు  పెండల రాజు,గణేష్,తూర్పాటి  మల్లేష్,దయ్యా కిరణ్,కౌడగని రాకేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.