"ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం దుర్మార్గమైన చర్య"

Submitted by Kramakanthreddy on Thu, 22/09/2022 - 16:37
"Renaming of NTR Health University is a nefarious act"

--- టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ యాదవ్
 మహబూబ్ నగర్, సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి న్యూస్) :  
ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది దుర్మార్గమైన చర్య అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు మార్చడం చాలా బాధాకరమని దీనిని తెలుగు ప్రజలు అంగీకరించరని అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు  పెట్టాలన్న బిల్లు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నిరంకుశ , తుగ్లక్ నిర్ణయాలతో జగన్ ఏం సాధిస్తారని, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మీరు ఎన్ని చేసినా ఎన్టీఆర్ చరిత్రను మార్చలేరని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్.టి.ఆర్ ని మా హృదయాలలో నుండి విడదీయలేరని అన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన దుర్మార్గమైన చర్య అని దీనిని తెలుగు ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని మండిపడ్డారు.