సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:30
The problems of Singareni contract workers should be resolved

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి)..///.  కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి లోని బెల్లంపల్లి సింగరేణి ఏరియా కాంట్రాక్టు కార్మికులు గత 14 రోజులుగా నిరవధిక సమ్మే చేస్తున్నా ప్రభుత్వం కానీ, సింగరేణి యాజమాన్యం కానీ స్పందించక పోవడం బాధాకర మని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి భోగి ఉపేందర్ అన్నారు. గురువారం గోలేటి టౌన్ షిప్ లోని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనానికి నోచుకోవడం లేదని, వేతన పెంపు నకు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహారి స్తుందని అన్నారు. చాలీ చాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించు కుంటూ కాలం నెట్టు కొస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నా యజమాన్యం కానీ ప్రభుత్వం గానీ పట్టించు కోవడం లేదని వాపోయారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నాయకులు సాగర్ గౌడ్, చల్లూరి అశోక్, శ్రీనివాస్, సోమయ్య, రాజేశ్వరి, కమల, తదితరులు పాల్గొన్నారు.