ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు... బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన తీరు... పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు...

Submitted by SANJEEVAIAH on Wed, 25/01/2023 - 21:55
Photo

ఉపాధ్యాయుడి పై కేసు 

బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

 పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

 నిజామాబాద్, ప్రజాజ్యోతి, జనవరి 25 :

నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోలీస్ కేసు నమోదు అయింది. నగరంలోని బార్కత్ పురకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అరవింద్ పాఠశాలలోని విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా శారీరక, మానసిక వేధింపులకు గురిచేసి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో ఒకరిద్దరూ విద్యార్థినిల పట్ల సదరు ఉపాధ్యాయుడు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం విద్యార్థినిల తల్లిదండ్రులకు ఆలస్యంగా చెప్పడంతో వారు తీవ్రంగా స్పందించారు. పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుని నిలదీయడమే కాకుండా జరిగిన విషయంపై ఆరా తీశారు. సదరు ఉపాధ్యాయుడిని చితకబాజే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో రెండవ రౌండ్ ఎస్సై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధాోపాధ్యాయుడు కృపాల్ సింగ్ ను ఫోన్ లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించ లేదు.