తొలిమెట్టు కార్యక్రమాన్ని పరిశీలించిన నోడల్ అధికారి వాసు

Submitted by Upender Bukka on Wed, 21/09/2022 - 12:26
Nodal Officer Vasu inspected the first step programme

నాగారం ప్రజా జ్యోతి 20సెప్టెంబర్../   ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాన్ని, ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. మంగళవారం నాగారం మండల కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమాన్ని నోడల్ అధికారి వాసు పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది 23 వేల ప్రాథమిక పాఠశాలలకు చెందిన 11.26 లక్షల మంది చిన్నారులకు కనీస విద్యా ప్రమాణాలు పెంపొందించే లక్ష్యంగా నిర్దేశించారని పేర్కొన్నారు.  కరోనా కంటే ముందు విద్యార్థుల ప్రామాణిక స్థాయి అధికంగా ఉండేదని, కరోనా విలయ తాండవం  చేస్తున్న సమయంలొ పాఠశాలలు మూతపడటంతో విద్యార్థుల సామర్థ్యం ,ప్రమాణాలు తగ్గిపోయాయని తెలిపారు. విద్యార్థుల ప్రమాణాలకు సామర్ధ్యాలకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లయ్య ,ఉపాధ్యాయులు వెంకట మల్లు, వీరేష్, రవీనా, క్లస్టర్ , ఆర్. పి లు, హరిప్రసాద్ పాల్గొన్నారు.