కెసిఆర్ అబద్దాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:11
 No matter how much is said about KCR's lies, it is less
  • తెలంగాణలో ప్రజలు సంవత్సరానికి 42 వేలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు
  • టిఆర్ఎస్ ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో కేవలం 25 వేలు ఇస్తుంది
  • ఈ లెక్క తప్పైతే నేలకు ముక్కు రాస్తా
  • ప్రజా వ్యతిరేక నరహంతక తెరాస ప్రభుత్వానికి చరమగీతం పాడాలి
  • టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి),,..// హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తనదైన రీతిలో విరుచుకుపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజాగోస బిజెపి భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. గురువారం సాయంత్రం గిమ్మ గ్రామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రజావ్యతిరేక నరహంతక తెరాస ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు.
గ్రామాల్లో రైతాంగాన్ని ప్రశాంతంగా ఉండకూడదని రెవెన్యూ వ్యవస్థను టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. ధరణి తెలంగాణ రైతుల కోసం తేలేదని, రైతుల కళ్ళల్లో మట్టి కొట్టడానికి తెచ్చారని అన్నారు. హైదరాబాద్ లో ఎకరం 100 కోట్లు ఉంటుందని, 2000 ఎకరాలు మాయం చేసి 1 లక్ష కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. కెసిఆర్ ఇచ్చే డబ్బులు ఫామ్ హౌస్ అమ్మి ఇవ్వడం లేదని,వాడవాడకి బెల్ట్ షాప్  పెట్టీ ప్రజల ప్రాణం తీస్తున్నారని అన్నారు. సంవత్సరానికి రాష్ట్రం లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్న డబ్బు 42 వేలకోట్లు అయితే సిఎం కెసిఆర్ పెన్షన్, కళ్యాణ లక్ష్మి, రైతుబందు పేరిట,  ఇచ్చేది కేవలం 25 వేల కోట్లు మాత్రమే నని, ఈ లెక్క తప్పు అయితే తాను ముక్కు నేలకు రాస్తానని అన్నారు. కెసిఆర్ అబద్దాల గురించి ఎన్ని చెప్పినా తక్కువేనని, కెసిఆర్ వల్లనే ఒక మహిళా తహసిల్దార్ మీద పెట్రోలు పోసి తగలబెట్టారని ఆయన పేర్కొన్నారు. 
డిపార్ట్మెంట్ ను అంపశయ్య మీద పడుకోబెట్టి అయన మార్క్ రాజకీయం మొదలు పెట్టిండని దుయ్యబట్టారు. అసైన్మెంట్ భూములు అన్నీ స్వాధీనం చేసుకుంటున్నారని,భూమి తప్పు పడిందని అంటే కోర్టుకు పొమ్మంటు న్నారని, పేద రైతు లక్షలు ఖర్చుపెట్టి కోర్టు మెట్లు ఎక్కగలరా ? అని ఆయన ప్రశ్నించారు.ధరణి రైతుల కోసం తేలేదని, రైతుల కళ్ళల్లో మట్టి కొట్టడానికి తెచ్చారని, ఇవన్నీ విఆర్వో, ఎమ్మార్వో లకు తెలుస్తుందని వారిని తప్పించి, ప్రగతి భవన్ చేతిలో స్విచ్ పెట్టుకొని వారి బినామీల పేరిట భూములు ధోరణి లో ఎక్కించు కున్నాడని ఆరోపించారు. విఆర్ఎ లు శాసన సభలో ఇచ్చిన హామీ అమలు చేయమంటున్నారని,60 రోజులుగా సమ్మె చేస్తున్నా, 50 మంది చనిపోయినా, నీరో చక్రవర్తి గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రామ కార్యదర్శుల మీద పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


భూ తల్లి మీద కన్నువేసి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినవాడు ఈ సీఎం కెసిఆర్ అని ఆయన అన్నారు. తెలంగాణ ఆడ బిడ్డలకు ఇంట్లో నీల్లోస్తాయ అని చెప్పారు కానీ ఎక్కడ నీళ్ళు లేవని,40 వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ తెచ్చినా నీళ్ళు తాగేవిధంగా లేవని, కులాయిల ద్వారా నాచు, మురికి వస్తుందని అన్నారు. డబుల్ బెడ్ రూం వద్దయ్యా ఎవరిజాగాలో  వారికి ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇద్దాం అని చెప్పినా వినకుండా మొండికేసి ఇప్పుడు పేదవారికి  సొంత ఇళ్లు లేకుండా చేశారని, అన్నారు. రాంపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు కోసం ఒక్కోక్కరి దగ్గర  70 వేలు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. 
పంజాబ్, హర్యానా, రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇచ్చి వస్తున్నావ్ కాని ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్ళు కోసం భుమి కొని ఇవ్వడనికి ఏం రోగం వచ్చిందని అన్నారు.   వేల కోట్లు మద్యం తాగి కుటుంబాలు నాశనం అవుతున్నాయని, పిల్లలు అనాథ లవుతున్నారని, ఇప్పటివరకు రాష్ట్రంలో 
12 లక్షల మంది పిల్లలు అనాధలు అయ్యారని లెక్కలు చెప్తున్నాయన్నారు. బెంజ్ కారులో వచ్చే  వారికి రైతుబంధు ఇచ్చే అధికారం నీకు ఎక్కడిదని,కెసిఆర్ నీ అబ్బ జాగీరు అను కుంటు న్నావా ? అంటూ నిలదీశారు.అన్నిటికీ నేనే అంటున్న నీ పదవి ప్రజల ఓట్లకు పుట్టింది అని మర్చిపోకు అన్నారు. ఎక్కడ ఇచ్చినావు దళితులకు 3 ఎకరాలు భూమి అని ప్రశ్నించారు. అసైన్ భూములు లాక్కొని ల్యాండ్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. గర్భవతులు అని కూడా చూడకుండా బూటు కాళ్ళతో తన్నిస్తున్న కెసిఆర్ పోడు భూముల సమస్య పరిష్కాానికి నోచుకోవడం లేదని అన్నారు. అదిలాబాద్ ఆర్థికంగా గొప్పగా లేకపోవచ్చుకానీ ఆలోచనలో గొప్పదని,చైతన్యవంతంగా ఉండి ఈప్రజావ్యతిరేక నరహంతక తెరాస ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు జిల్లా బిజెపి అధ్యక్షుడు పాయల శంకర్ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.