వినండహో.... నగర పాలక అధికారుల నిర్వహకం... పన్ను చెల్లించలేదని ఇంటికి తాళం... పేద కుటుంబాన్ని రోడ్డున పడేసిన వైనం... ఇద్దరు పిల్లలతో కట్టుబట్టలతో వెళ్లిన తల్లి... రూ.28 వేల కోసమే కట్టుబట్టలతో బయటకు పంపారు... అ అధికారికి ఏందుకంతా చోరవో మరి...

Submitted by SANJEEVAIAH on Thu, 11/04/2024 - 15:29
photo

వినండహో.... నగర పాలక అధికారుల నిర్వహకం...
పన్ను చెల్లించలేదని ఇంటికి తాళం...
పేద కుటుంబాన్ని రోడ్డున పడేసిన వైనం...
ఇద్దరు పిల్లలతో కట్టుబట్టలతో వెళ్లిన తల్లి...
రూ.28 వేల కోసమే కట్టుబట్టలతో బయటకు పంపారు...
అ అధికారికి ఏందుకంతా చోరవో మరి...

(నిజామాబాద్‌ బ్యూరో ` ప్రజాజ్యోతి ` ఎడ్ల సంజీవ్‌)

వినండహో... మన నిజామాబాద్‌ నగర పాలక సంస్థ అధికారుల పనితీరు. ‘‘నవ్విపోదురు గాక నాకేమిటీ సిగ్గు’’ అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. లక్షల, వేల రూపాయాలు పన్నులు కట్టకుండా ఏగవేస్తున్న బడానేతలు, వ్యాపారులను వదిలేస్తున్న నగర పాలక రెవెన్యూ అధికారులు రూ.27.98 వేలకే ఓ ఇంటికి తాళం వేసి కుటుంబాన్ని రోడ్డున పడేసారు. మార్చి 30న ఇంటికి తాళం వేసి తండ్రి లేని కుటుంబాన్ని రోడ్డున పడివేసిన సంఘటన నిజామాబాద్‌ నగరంలోని ఏల్లమ్మగుట్టలో జరిగింది. సరిగ్గా పది రోజులుగా నిలువ నీడలేక ఇద్దరు పిల్లలతో ఓ తల్లి ఆరిగోస పడుతున్న తీరు కన్నీరు పెట్టిస్తుంది. ఇది సాక్షాత్తు నిజామాబాద్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌ ఆధ్వర్యంలో జరిగినట్లు మున్సిపల్‌ రెవెన్యూ అధికారులు చెప్పడం గమనర్హం. 

ఇది సంగతి...

ఇంటి నంబర్‌ 5`10`46, పిటిఐఎన్‌ నం. 1046009439 గల ఇల్లు యండల నర్సింలు పేరుతో ఉంది. ఇద్దరు కొడుకులకు ఇంటిని పంచి ఇచ్చారు. అయా బాగాలలో ఇద్దరు అన్నదమ్ములు అయిన యండల సురేందర్‌, యండల సుధాకర్‌లు ఉండాలి. కానీ వీరు ఇతర ఏరియాలో ఉన్నారు. అయితే తమ దగ్గరి బందువు రమేష్‌కు ఇచ్చారు. రమేష్‌ అయన భార్య పిల్లలు కలిసి ఉండగా రమేష్‌ మరణించాడు. దీంతో రమేష్‌ భార్య శ్రవంతి, ఇద్దరు పిల్లలు కార్తీక్‌, తరుణ్‌లు ఉంటారు. ఇలా ఇంటి యజమాని అయిన సురేందర్‌ ఇల్లు టాక్సీ కట్టడంలో జాప్యం చేసారు. ఇటీవల అంటే మార్చి 30లోపు ఇల్లు టాక్సీలు చెల్లించాలని నగర పాలక అధికారులు విస్త్రతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఇంటిపై ఇప్పటి వరకు రూ.27,986లు మాత్రమే టాక్సీ చెల్లించాల్సి ఉంది. దీని కోసం నగర పాలక రెవెన్యూ అధికారులు నానాయాగి చేసి మార్చి 30న ఇంటిలో ఉన్న మహిళలను ఇద్దరు పిల్లలను బయటకు పంపించి ఇంటిని సీజ్‌ చేసారు. ఇంటి పన్ను చెల్లించే అంత వరకు ఇంటి తాళం తీయ్యవద్దని హెచ్చరించారు. ఇది సంగతి. తెలియాల్సిన అసలు సంగతి ఏమిటంటే...?

అంత ఉత్సహామేలా..?

హైదరాబాద్‌లో బడా వ్యాపార సంస్థలు లక్షల రూపాయాల పన్నులు చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి పెండిరగ్‌లో ఉంటున్నాయి. నిజామాబాద్‌ ఖలీల్‌వాడి, నెహ్రుపార్కు, గాంధీ చౌక్‌లలోని వ్యాపార సంస్థల వేల రూపాయాల టాక్సీలు పెండిరగ్‌లో ఉన్నాయి. ఇక మాలపల్లి, ఖిల్లా ప్రాంతంలోని వ్యాపార సంస్థలు, ఇళ్ల యాజమానుల సంగతి పూర్తిగా బహిరంగ రహస్యమే. ఇవన్ని వదిలేసిన నగర పాలక అధికారులు చిన్నచిన్న కుటుంబాలు ఆర్థికంగా చతికిల బడిన కుటుంబాలపై తమ జూలం కోరడా జులిపిస్తున్నారు. అమయాకులను భయపెట్టి వసూళ్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థకు కూత వేటు దూరంలోని ఏల్లమ్మగుట్టకు చెందిన 5`10`46 ఇంటికి సంబంధించిన రూ.27,986 ల కోసం ఇంటికి తాళం వేసి తన పని (మ...)తనం చూపించారు. సదరు బాధితురాలు నెత్తినోరు బాదుకున్న సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు ఒక్కరోజు టైం ఇస్తే సగం టాక్సీ చెల్లిస్తానని కాల్లు పట్టుకున్నప్పటికి వినకుండా ఇంటికి తాళం వేసారు. సదరు మహిళ చేసేది లేక ఇద్దరు పిల్లలను వెంట పెట్టుకొని బయటకు వెళ్లలాల్సి వచ్చింది. కనీసం ఇంట్లో నుంచి బట్టలు, పిల్లల స్కూల్‌ బ్యాగులు తీసుకోకుండా బయటకు పంపించారు. ఇంతలా నగర పాలక అధికారులు వ్యవహారించడం వెనక ఉన్న హస్తం ఎవరిది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అ అధికారులే ఏందుకు.?

రూ.27,986 వేల టాక్సీ కోసం నగర పాలక సంస్థ డీప్యూటీ కమిషనర్‌, ఓ సీనియర్‌ రెవెన్యూ అధికారి, మరో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ మరి కలుగజేసుకొని ఏల్లమ్మగుట్టలోని ఇంటికి వెళ్లడం వెనక మర్మం ఏమిటీ అనేది అంతు చిక్కడం లేదు. కనీసం ఇద్దరు పిల్లలు, భర్త లేని ఓ ఇల్లాలు ముఖం కూడా చూడకుండా ఇంటికి తాళం వేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఏల్లమ్మగుట్టలోని పోలీసు లైన్‌ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి, 6వ తరగతి చదువుతున్నారు. కనీసం వీరి బ్యాగులు కూడా ఇవ్వకుండా బయటకు పంపడం అంటే నగర పాలక అధికారులు ఉద్దేశ్యం ఏమిటీ.? ఇంత పక్క పకడ్బంధిగా ఇంటికి తాళం వేయాల్సి అవసరం ఏమి ఉందో ఇంటిని సీజ్‌ చేసిన అధికారులకే తెలియాలి. 
నిత్యం ప్రగల్బాలు పలికే నేతలు ఇలాంటి సంఘటనలపై ఏందుకు నోరు విప్పరో అర్థం కానీ పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, నిజామాబాద్‌ నగర పాలక కమిషనర్‌ స్పందించి చర్యలు తీసుకుంటే ఓ కుటుంబానికి రక్షణ కల్పించిన వారు అవుతారు. అలాగే ఈ చర్యకు పాల్పడిన అధికారులపై మానవ హక్కుల రక్షణను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తారో చూద్దాం మరి.