నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

Submitted by BikshaReddy on Sun, 18/09/2022 - 17:07
adilabad

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 18, (ప్రజా జ్యోతి)

అసెంబ్లీలో నూతన పార్లమెంట్ భవనానికి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని ప్రస్తావిస్తుంటే రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న బిజెపి ఎమ్మెల్యే బయటకి వెళ్ళిపోవడం పట్ల వారి వైఖరిని స్పష్టం చేయాలని లేనియెడల బిజెపి నాయకులు పల్లెల్లో పట్టణాలలో ప్రజల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం 
అదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని కేఆర్ కే కాలనీ లో 10 లక్షల రూపాయలతో స్మశాన్ ఘాట్ వరకు బీటీ రోడ్ పనులతో పాటు పిట్టల వాడ  లో 35 లక్షల రూపాయలతో స్మశాన్ ఘాట్  అభివృద్ధి పనులు, మరో 40 లక్షలతో పద్మావతి నగర్ నుండి పిట్టలవాడ వరకు బీటీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న  భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న  మాట్లాడుతూ  గత పాలకుల హయాంలో కె ఆర్ కే కాలోని,  పిట్టల వాడ పరిస్థితి దయనీయంగా ఉండేదని  ఎమ్మెల్యే తన అనుభవాన్ని పంచుకున్నారు. నేడు ప్రత్యేక రోడ్లు, డ్రైనేజీలు, మున్సిపల్ పార్కులు, హిందూ స్మశాన వాటికలు, ఇలా అనేక  అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న  తెలంగాణ  రాష్ట్ర సచివాలయ  భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  పేరును పెట్టడానికి తీసుకున్న నిర్ణయం చరిత్రా త్మకమని కొనియాడారు. మహానగరంలోని జూబ్లీహిల్స్ లో  కొమరం భీమ్ ఆదివాసి భవనమునకు,  శ్రీ సేవాలాల్ బంజారా భవన్ ల ప్రారంభోత్సవంను భారత దేశంలోనే మొట్టమొదటిసారి సీఎం కేసీఆర్ ప్రారంభించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్  నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ వారి సంస్కృతలను కాపాడుకోవడం జరుగు తుందన్నారు. అంతేకాకుండా రైతులకు రైతు బీమా, రైతు బంధు తో పాటు దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలని, వారి ఆర్థిక స్థితిగతులను మార్చేలా దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. దమ్ముంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరుని పెట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3  ద్వారా నేడు తెలంగాణ సిద్ధించు కోగలిగామని తెలియజేశారు.  టిఆర్ఎస్ ప్రభుత్వంతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చేర్మెన్ జెయిర్ రంజాని, పట్టణ అధ్యక్షులు అజయ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, వార్డ్ కౌన్సిలర్లు  అంజు బాయి, సంగీత దమ్మ పాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, స్వరూప రాణి, మమత,  దివిటీ రాజు, ఆశన్న, కౌన్సిలర్లు ,టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags