కోమటికుంట గ్రామంలో దళితబంధులో గొర్రెలు,గేదెలు యూనిట్లు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శాణంపుడీ సైదిరెడ్డి

Submitted by Ramesh Peddarapu on Fri, 30/09/2022 - 16:50
MLA Sanampudi Saidireddy distributed sheep, buffalo units and Bathukamma sarees among Dalit Bandhu in Komatikunta village.

ఆర్ధికంగా అణగారిన వర్గాలను అభివృద్ధి చేయడమే కెసిఆర్ ధ్యేయం.

దళితులు బందు పదకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలి

పాలక వీడు,సెప్టెంబర్30(ప్రజా జ్యోతి):  ఆధునిక పద్ధతుల్లో పాల ఉత్పత్తిని అభివృద్ధి చేసి అందరికీ.ఆదర్శంగా ఉండాలని,గొర్రెల పెంపకంలో యాదవుల సలహాలు తీసుకోవాలని,డాక్టర్.సలహాలు తీసుకోవాలని,తమని తాము  ఆర్దికంగా అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.మండల పరిధిలోని కోమటికుంట గ్రామంలో దళితబందు  పైలేట్ ప్రాజెక్టు కింద ఒకే గ్రామంలో 33 దళిత కుటుంబాలకు దలితబందు పదకం అమలు చేసినవిషయం తెల్సిందే.అందులో భాగంగా కొందరు గేదెలు,గొర్రెల యూనిట్లు ఎంచుకొగ  వారికి నేటితో పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసినట్లు హుజూర్నగర్ ఎమ్మేల సైదిరెడ్డి స్పష్టం చేశారు.డిసెంబర్ నెలలో నియోజకవర్గంలో మరో 500 యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందితే యావత్ తెంగాణ రాష్ట్రం అభివృద్ది చెందినట్లు అన్నారు.నియోజక వర్గంలో 89000 మందికి రైతు బందు నిర్విరామంగా అందిస్తూ ఏటా లబ్ధిదారులను పెంచుకుంటూ ముందుకు పోతున్నామని .ప్రతి ఇంట్లో ఎదో  విందంగ ప్రభుత్వ పధకాలు పొందుతున్నారు.గత ప్రభుత్వాల నాయకులు దోచుకో దాచుకో అన్నట్లు చేస్తే కెసిఆర్ ప్రభుత్వం ప్రతి అణగారిన వర్గాల అభివృద్ది చెందాలని నిస్వార్థ పరిపాలన చేస్తున్నారన్నారు.

ఆధునిక పద్ధతుల్లో పాలోత్పత్తికి కృషి చేయాలని సూచించారు.వెటర్నరీ సిబ్బంది అన్నివిధాలుగా వారికి సహకరించాలని ఆదేశించారు.  మళ్ళీ ఏడాదికల్ల ఆర్ధికంగా ప్రతి దళిత కుటుంబం నిలదొక్కుకుని సమాజం లో హుందాగా బతకాలని లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు .ప్రభుత్వ పధకం ద్వారా వచ్చిన అభివృద్ది పొరుగు రాష్ట్రాల ప్రజలకు ఆదర్శం కావలన్నారు.తదుపరి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి,రైతు సంఘం జిల్లా సభ్యుడు దర్గరావు,గ్రామ సర్పంచ్ రమలక్షమమ్మ, లక్ష్మీనారాయణ   సొసైటి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి,జిల్లా పషువర్డక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్,ఎమ్మార్వో శ్రీదేవి,ఎంపిడిఓ వెంకట చారి,వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్,బి.  రాజ శేఖర్,పి. దాదే ఖాన్,బాలు నాయక్, గాదె నాగరాజు,మండల నాయకులు, గ్రామ     ప్రజలు,  దళిత బందు లబ్ది దారులు  తదితరులు     పాల్గొన్నారు.