బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసిన-ఎమ్మెల్యే రాజయ్య

Submitted by bosusambashivaraju on Wed, 28/09/2022 - 13:18
MLA Rajaiah distributed Bathukamma sarees and Asara pension cards

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 27 ( ప్రజాజ్యోతి ) : - స్టేషన్ ఘనపూర్  మండలం , చాగల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద  సర్పంచ్ పోగుల సారంగ పాణి  అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చాగల్ గ్రామానికి సంబంధించిన ఓల్డ్ పింఛన్లకు సంబంధించిన ఆసరా పింఛన్ కార్డులను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా , పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను  ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ  రాజయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ బతుకమ్మ చీరలు పంపించడం జరుగుతోందని తెలిపారు. అందులో భాగంగానే  నేడు చాగల్లు గ్రామంలోని మహిళలకు  బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే  తెలిపారు. చాగల్ గ్రామానికి సంబంధించిన 1774  బతుకమ్మ చీరలు మహిళలకు , అలాగే 701 ఆసరా పింఛన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా చాగల్లు గ్రామానికి దళితులకు మార్చి నాటికి 15మందికి దళిత బంధును అందిస్తానని, చాగల్లు నుండి కమ్మరి కుంటకు వెళ్లే దారి మంజూరి చేస్తానన్నారు.
 
*అనంతరం మీదికొండలో గ్రామంలో*....

మండలంలోని  మీదికొండ గ్రామంలో గ్రామ పంచాయతి కార్యాలయ ప్రాంగణం వద్ద  సర్పంచ్ నాగరబోయిన మణెమ్మ  అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మీదికొండ గ్రామానికి సంబంధించిన ఓల్డ్ పింఛన్లకు సంబంధించిన ఆసరా పింఛన్ కార్డులను  రాష్ట్ర ప్రభుత్వం,  రాష్ట్రములోని మహిళలందరికీ ఉచితంగా పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే రాజయ్య  లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
మీదికొండ గ్రామానికి సంబంధించిన 1134   బతుకమ్మ చీరలు మహిళలకు,    అలాగే 453 ఆసరా పింఛన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే విధంగా మీదికొండ గ్రామానికి 15 మందికి మూడు విడతల్లో దళిత బంధును అందిస్తానని స్పష్టం చేశారు. అలాగే ఆరు నెలల వ్యవధిలో అర్హులైన పేద వారికి 60 ఇల్లు మంజూరి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్, జడ్పీటీసీ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఎంపీటీసీ స్వరూప, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు గణేష్, ఉప సర్పంచ్ పొన్న రజిత, సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్, ఉపసర్పంచ్ పొన్నం రంజిత్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు గొడుగు సంజువు, మాజీ సర్పంచ్ నాగరబోయిన శ్రీరాములు, గ్రామ శాఖ ఇన్చార్జ్ జోగు కుమార్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు జోగు వసంత, గ్రామ యూత్ అధ్యక్షుడు జోగు సురేంద్రబాబు, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు జోగురాజు, మండల యువజన నాయకులు మారపాక ప్రశాంత, లెనిన్, అశోక్, రమేష్,  కిష్టయ్య, థామస్, యాకయ్య, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు , అధికారులు , సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.