టూరిజం అభివృద్ధి కి చర్యలు

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 13:53
Measures for the development of tourism


జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి:సెప్టెంబర్ 24:( ప్రజా జ్యోతి)..// జిల్లాలో టూరిజం అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. . మడలంలోని అడ ప్రాజెక్టులో 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన బోటింగ్ ప్రక్రియను శనివారం ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పేయి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు జెడ్పిటిసి నాగేశ్వరరావు ల తో కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా ప్రాజెక్టులో బోటింగ్ ట్రిప్పు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని ప్రాంతాల్లో బోటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు బోటింగ్ అందు బాటులోకి రావడం వల్ల టూరిజం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు ప్రాంతంలో పర్యాటకుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు వివరించారు. బోటింగ్ ను జిల్లా ప్రజలు వినియోగించు కోవాలని సూచించారు. టూరిజం అధికారులు మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో బోటింగ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఒక్కొక్కరికి 50 రూపాయలు చొప్పున టికెట్ ధర నిర్ణయించే అవకాశం ఉందన్నారు. పుట్టినరోజు వేడుకలతో పాటు ఇతర వేడుకలు కూడా ఇందులో జరుపుకోవడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, డిపిఎం రామకృష్ణ, ఇతర అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.