మాక్లూర్‌ సోసైటీలో హైడ్రామా... అ సెక్రెటరీ డిప్యూటేషన్‌ వివాదస్పదం... అవినీతి, అరోపణలపై ఎంక్వరీ పెండింగ్... అయిన మళ్లీ పోస్టింగ్‌... చేతులు మారిన రూ.13 లక్షలు...

Submitted by SANJEEVAIAH on Sat, 01/06/2024 - 17:02
Photo

మాక్లూర్‌ సోసైటీలో హైడ్రామా...

అ సెక్రెటరీ డిప్యూటేషన్‌ వివాదస్పదం...

అవినీతి, అరోపణలపై ఎంక్వరీ పెండింగ్...

అయిన మళ్లీ పోస్టింగ్‌...

చేతులు మారిన రూ.13 లక్షలు...

సోసైటీ పాలకవర్గం రద్దు 

(నిజామాబాద్‌ ప్రతినిధి - ప్రజాజ్యోతి)

మాక్లూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పిఎసిఎస్‌)లో హైడ్రామా కొనసాగుతుంది. సోసైటీ కార్యదర్శి(సిఈవో) డిప్యూటేషన్‌ వివాదస్పదం అవుతుంది. సోసైటీ యాక్ట్‌ హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం డిప్యూటేషన్లు రద్దు అయినప్పటికి డీఎల్‌ఈసీలో ఆమోదం తెలిపి నిజామాబాద్‌లో పని చేస్తున్న కార్యదర్శి విష్ణువర్దన్‌ను మాక్లూర్‌ సోసైటీకి డిప్యూటేషన్‌పై పంపుతూ డిఎల్‌ఈసీ కన్వీనర్‌ మే 2, 2024న పిఎసిఎస్‌ హెచ్‌ఆర్‌డి సెల్‌/ 2024`25 జారీ చేసారు. అయితే అప్పటికే మాక్లూర్‌ సోసైటీ కార్యదర్శిగా సంతోష్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి విధులు నిర్వహిస్తుండగా మరోవ్యక్తికి పోస్టింగ్‌ ఇవ్వరాదు. కానీ ఇక్కడ ఏకంగా పోసింగ్‌ విషయం పక్కన పెట్టి ఏకంగా డిప్యూటేషన్‌ వేయడం ఇప్పుడు వివాదస్పదం అయింది. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలోని కో ఆపరేటివ్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సోసైటీ పాలకవర్గం రద్దు అయినప్పటికి నిబంధనాలకు విరుద్దంగా పాలకవర్గాన్ని నియమించుకోని కొనసాగడం విశేషం.

అసలు సంగతి ఇది...

మాక్లూర్‌ సోసైటీలో కార్యదర్శిగా పని చేస్తున్న విష్ణువర్దన్‌ అలియాస్‌ విష్ణుపై పలు ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు ముప్పై సంవత్సరాలకు పైగా ఒకేచోట పని చేయడంతో పలు వివాదాలు వచ్చాయి. అయితే దీనిపై డీసీవోకు ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగింది. ఈ విచారణలు పలు వివాదస్పద వ్యవహారాలు బయటకు రావడంతో సోసైటీ పాలకవర్గం కార్యదర్శిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తీర్మాణం చేసి  డీసీవోకు పంపారు. కానీ డీసీవో సింహాచలం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉండగా కాలయాపన చేసారు. మరోవైపు రాత పూర్వకంగా ఏలాంటి చర్యలు తీసుకోకుండానే మాక్లూర్‌ నుంచి కార్యదర్శి విష్ణును తొలగించి, నిజామాబాద్‌ సోసైటీకి పంపించారు. ఇదంతా 2022లో జరిగింది. అ తర్వాత మాక్లూర్‌ సోసైటీలో అక్కడే అసిస్టెంట్‌ కార్యదర్శిగా పని చేస్తున్న సంతోష్‌ను రెగ్యులర్‌ కార్యదర్శిగా కొనసాగించారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి ఇటీవల సోసైటీ కార్యదర్శిలకు హెచ్‌ఆర్‌ పాలసీ వర్తింపజేయాలని ఆదేశాలతో డీఎల్‌ఈసీ సమావేశం అయింది. ఈ సమావేశంలో నిజామాబాద్‌ సోసైటీలో పని చేస్తున్న విష్ణును మాక్లూర్‌ సోసైటీలో డిప్యూటేషన్‌పై పోస్టింగ్‌ ఇచ్చి డిప్యూటేషన్‌ ఉత్తర్వులను ఇచ్చారు. ఇక్కడ పని చేస్తున్న సంతోష్‌ను అదే స్థానంలో ఉంచి మరోవ్యక్తికి డిప్యూటేషన్‌ ఇవ్వడమే వివాదస్పదంగా మారింది. హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం ఎక్కడ పోస్టింగ్‌ ఉంటే అక్కడే కొనసాగించాలి. కానీ ఇక్కడ ఓ కార్యదర్శి ఉండగా నిబంధనాలకు విరుద్దంగా మరో కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పోస్టింగ్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

చేతులు మారిన రూ.13 లక్షలు....

ఈ తాతంగం మొత్తంలో రూ.13 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతుంది. ఆర్మూర్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ నేత కలుగజేసుకోవడం, అధికారులపై ఒత్తిడి చేయడంతో ఈ డిప్యూటేషన్‌ పోస్ఠింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని కోసం జిల్లా కో ఆపరేటివ్‌ శాఖలో పని చేసిన జిల్లా స్థాయి అధికారికి రూ.5 లక్షలు, మరో రూపంలో మరికొన్ని లక్షలు ఇచ్చినట్లు ప్రచారం ఉంది. మరోవైపు డిఎల్‌ఈసీలో చక్రం తిప్పెందుకు ఓ అధికారి ద్వారా రూ.7 లక్షలు చేతులు మారినట్లు తెలుస్తుంది. దీంతో ఈ వ్యవహారం ఏంత దూమరం రేపిన సదరు కార్యదర్శిని మాక్లూర్‌లో కొనసాగించేందుకు ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే సోసైటీకి సంబంధించిన డైరెక్టర్లు, అక్కడ పని చేసే కార్యదర్శి సంతోష్‌ ఫిర్యాదు చేయడంతో డీసీవో శ్రీనివాస్‌రావు తిరిగి డీఎల్‌ఈసీకి లేఖ రాసారు. నిబంధనాలకు విరుద్దంగా డిప్యూటేషన్‌పై పంపిన విష్ణును తిరిగి నిజామాబాద్‌ పంపించాలని కోరుతూ డీఎల్‌ఈసీకి లేఖ రాసారు. ఇప్పుడు అసలు బంతి డీఎల్‌ఈసీ గ్రౌండ్‌లో పడిరది. అయితే డీఎల్‌ఈసీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న రమేష్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి ఏలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది.