విద్యార్థుల సామర్థ్యాల పెంపుకై తొలిమెట్టు తొలిమెట్టు మూల్యాంకన యాప్ పై అవగాహన

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 17:24
It is the first step to enhance students' abilities  Understanding the first step assessment app

 తొర్రూరు సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి) .  విద్యార్థుల్లో ప్రాథమికంగా నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని మండల విద్యాశాఖ అధికారి గుగులోతు రాము అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్రూర్ లో గురువారం తొలిమెట్టు మూల్యాంకానికై రూపొందించిన యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో అమలవుతున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని మూల్యాంకనం చేయడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం యాప్ను రూపొందించిందని తెలిపారు. విద్యార్థుల సామర్ధ్యాన్ని అక్కడికక్కడే మూల్యాంకనం చేసి సంబందించిన సమాచారంను యాప్ ద్వారా ఆన్లైన్ లో  నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిమెట్టు మూల్యాంకనంకై కాంప్లెక్స్కు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తద్వారా మూల్యాంకన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం ఆప్ వినియోగంపై తోర్రుర్, చెర్లపాలెం, వెలికట్ట,   కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పోగు శ్రీను బాబు,తండా ప్రభాకర్,జె. వి. రామ్ యాప్ పై అవగాహన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు క్లస్టర్ రిసోర్స్ టీచర్స్, సి ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.